ఆరోగ్య ప్రదాత..సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద సీజనల్‌ వ్యాధులకు చికిత్స

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం

21రకాల సీజనల్‌ వ్యాధులకు చికిత్స

బీపీ, షుగర్‌ పేషెంట్లకూ వైద్య సేవలు

జనవరి 1నుంచి పశ్చిమ గోదావరిలో అమలు

అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పేద ప్రజల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకానికి ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఊపిరి పోశారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ పథకానికి పెద్ద పీట వేశారు. సీజనల్‌ వ్యాధులకు కూడా ఈ పథకం కింద చికిత్స చేయించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం ఎలా ఉందో ..వైయస్‌ఆర్‌ హయాంలో ఎలా ఉందో చూశారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఆరోగ్య ప్రదాత వైయస్ఆర్.   సమస్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. చంద్రబాబు పాలన ఏం పాలనో ఎవరికీ తెలియదు. బహుశా రాక్షసులు కూడా ఇలా పాలించివుండరేమో. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు రైతు కుటుంబంలో ధనధాన్యాలుండేవి. అనారోగ్య సమస్యలు లేకుండా చేశారు. అలాంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నీరుగార్చారు చంద్రబాబు.  అనారోగ్యం వచ్చిందని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అర్జి పెట్టుకుంటే వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలని నిధులు ఇవ్వ లేదు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యాధులను ప్రభుత్వం వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది.  ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 21రకాల సీజనల్‌ వ్యాధు లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. వైద్యం ఖర్చు రూ. 1,000దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామన్న సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేవలం సూపర్‌ స్పెషాలిటీ సేవలు, ప్రసూతి సేవల కింద వచ్చే శస్త్రచికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ఇకపై వెయ్యి రూపాయిలు దాటిన ప్రాథమిక చికిత్సలను కూడా దీని పరిధిలోకే రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 1,059 శస్త్రచికిత్సలు కాకుండా కొత్తగా మరో 1,000 చికిత్సలకు అనుమతులు ఇవ్వనున్నారు. కొత్త చికిత్సలను జనవరి 1నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో రెండునెలల పాటు అమలు చేయనున్నారు. పథకం అమలులో వచ్చే ఇబ్బందులను తొలగించుకుని, వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు. సంస్కరణల కమిటీ సభ్యులు కూడా ఈ అంశాలపై ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు.   మరోవైపు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు కేవలం మందులు కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. ఇవికాకుండా ఏదై నా సమస్యతో 24గంటల పైన ఆస్పత్రిలో చికిత్స పొం దినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చే స్తున్నారు. సీజనల్‌ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే సమస్యలను ‘డే కేర్‌’ సేవల కిందకు తీసుకురానున్నారు.

బడ్జెట్‌ రెండింతలు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ గతేడాది అన్ని పథకాలకు కలిపి సుమారు రూ.1,500కోట్లు ఖర్చుచేసింది. కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికి రెండింతల బడ్జెట్‌ అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే 1,000 శస్త్రచికిత్సలకే సుమారు రూ.1,000కోట్లు అవుతుందంటున్నారు. దీనికితోడు ఆరోగ్యశ్రీ ప్యాకేజీని రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు. కొత్తగా పొరుగు రాష్ట్రాల్లోనూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 

Back to Top