ప్రభుత్వ అధీనంలో వైద్యం-సామాన్యులకు చేరువగా చికిత్స

కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇంతలా ఉన్నా వైద్యసేవలు ఎంతో బాగా అందుతున్నాయంటే కారణం వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడమే. తక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల సేవలు వినియోగిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, సిబ్బందిని ప్రభుత్వమే తన అండర్ లోకి తీసుకుని విధులను నిర్వహించేలా ఆదేశాలిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో సాధారణ వైరల్ జ్వరాలు వస్తేనే ప్రభుత్వాసుప్రతుల్లో మందులుండేవి కాదు. ప్రైవేటు హాస్పటళ్లకు వెళ్లి వేల రూపాయిలు వైద్యం కోసం ధారబోసిన సంఘటనలు కోకొల్లు.
నేడు ఇలాంటి విపత్కర పరిస్థితిలో జగన్ ఇలాంటి సంక్షోభం ఎదురుకాకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు.ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచడం వల్ల ప్రజలకు వైద్యం ఉచితంగా లభించింది.
కోవిడ్ ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడమే కాకుండా, వాటి చికిత్సలకయ్యే ఖర్చు విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకున్నారు.ఇది శుభపరిణామం. విచ్చలవిడిగా ప్రైవేటు వైద్యం బారిన పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకోకుండా, అవకతవకలు జరిగే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం.రాష్ట్రవ్యాప్తంగా 58 ప్రైవేటు ఆసుపత్రులను కరోనా చికిత్సలకోసం తన అధీనంలోకి తీసుకుంది ఏపీ సర్కార్. విశాఖలో5, కృష్ణాలో 5, ప్రకాశం 4, కర్నూల్ 6, చిత్తూర్ 5, కడప 3, గుంటూరు 4, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 3, విజయనగరం 5, శ్రీకాకుళం 4 ప్రైవేట్ హాస్పట్స్ లో కోవిడ్ 19 చికిత్సకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల 19,114 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1,286 ఐసీయూ, 717 ఐసొలేషన్ బెడ్స్ సిద్ధమయ్యాయి.

కార్పొరేట్ స్థాయి వైద్యం అందుకునే వర్గం ఉంటుంది. కానీ సామాన్యులక ఆస్థాయి వైద్యం అందాలన్న ఆశయంతోనే నాడు వైయస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ ద్వారా భయంకరమైన కరోనా మహమ్మారిని తరిమే చికిత్సను అందరికీ అందుబాటులోకి తెచ్చారు వైయస్ జగన్. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలనీ, కార్పొరేట్ వ్యవస్థలో నలిగిపోతున్న విద్యా, వైద్య రంగాలకు తిరిగి ఊపిరిపోయాలనీ సంకల్పించి నాడునేడు కార్యక్రమం ప్రారంభించారు వైయస్ జగన్.  అలాంటి మహోన్నత ఆశయాన్ని సాధించడం జగన్ వల్లే సాధ్యం అనడానికి, కోవిడ్ 19 నివారణా చర్యల్లో అమలు చేస్తున్న విధానమే ఒక ఉదాహరణ.

Back to Top