అమరావతి ఒక దేశం

ఇదెక్కడుందో అని గ్లోబంతా వెతక్కండి. మన దేశంలో మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో ఉన్న రాజధాని అమరావతి గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడకు కాలు పెట్టాలంటే ఎల్లో బాస్ ల పర్మిషన్ కావాలి. అమరావతిలో మాట్లాడాలంటే ఎల్లోబాసులకు బానిసల్లా పనిచేసే పోలీసుల పర్మిట్ కావాలి. ఇక్కడ చట్టం పని చేయదు. న్యాయానికి రక్షణ ఉండదు. పౌరహక్కులు అనేవాటికి విలువ వంకాయ అసలే దొరకదు. 

నాయకులే కీచకులై సెక్స్ రాకెట్లు నడుపుతారు. వేల ఎకరాల రైతుల భూములను బలవంతంగా లాక్కుంటారు. తిరగబడ్డ వారి పంటలు మంటల్లో తగులపబెడతారు. భూమివ్వని రైతుల పొలం నుంచి చెప్పకుండా రహదారులు వేసేస్తారు. కష్టం చెప్పుకోను కరకట్టకు వచ్చిన వారిని కసిరి విసిరి తరిమేస్తారు. అమరావతి దేశంలో ఉన్నది రాచరికమా? సైనికపాలనా? నియంతృత్వ పాలనా? అన్నీ కలిసిన అరాచక ప్రభుత్వ పాలనా అని అనుమానం వద్దు. అక్షరాలా ఇది అన్యాయమైన పాలనే. అమరావతిని సొంత జాగీరులా, ప్రజలను బానిసల్లా, అధికారాన్ని సొంత సొత్తులా భావిస్తున్న అవినీతి చక్రవర్తులు పాలిస్తున్న ప్రాంతం. 

ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం అని, అదీ తెలుగుదేశం అధీనంలో ఉన్న దేశం అని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ గత ఐదేళ్లుగా అనుకుంటున్నారు. ఈ దేశంలో ఎవరు కాలు పెట్టాలన్నా, నోరు విప్పాలన్నా వారి అనుమతితోనే జరగాలని షరతులు పెడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు ఓ పక్క లేఖ ఇచ్చి, మరోపక్క సమైక్య ఆంధ్ర ఉద్యమం కోసం పోరాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లో అడుగుపెట్టాలంటే వీసా కావాలేమో అని ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేలా, రెచ్చగొట్టే వాఖ్యలు చేయడాన్ని మరువలేం. కానీ నేడు అదే చంద్రబాబు అమరావతినీ, ఆంధ్రరాష్ట్రాన్నీ అత్తగారి సొత్తులా అనుకుంటున్నాడు. ఒకప్పుడు విశాఖ ఎయిర్పోర్టుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రాకూడదని అడ్డుకున్నట్టే, నేడు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీని విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు. అమరావతిలో ఓ సినిమా ప్రెస్ మీట్ పెడితే ప్రభుత్వం కూలిపోతుందా? ఓ సినిమా చంద్రబాబును అంత కలవరపెడుతోందా? ఆర్జీవీ సినిమా కాదు, ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు కూసాలు కదిలిపోతాయా? బాబు భయం చూస్తే అలాగే అనిపిస్తోంది. అమరావతి దేశంలో బాబు తనకు అనుకూలంగా అనుమతుల చట్టం చేసేలా కనిపిస్తోంది. 

Back to Top