ఊపందుకున్న ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’- మూడో రోజూ రాష్ట్ర‌వ్యాప్తంగా న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం 
- ఇంటింటా ప‌ర్య‌టిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- చంద్ర‌బాబు పాల‌న‌పై దుమ్మెత్తిపోస్తున్న జ‌నం

అమ‌రావ‌తి:  ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అనే నినాదంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఊపందుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నెల 17వ తేదీన మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఇంటింటా ప‌ర్య‌టించి న‌వ‌ర‌త్నాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. పార్టీ నాయ‌కులు చేప‌ట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. బుధ‌వారం మూడో రోజు ఈ కార్య‌క్ర‌మం రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయి జనబాహుళ్యానికి చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీ కి ఓట్లేసి మద్దతు పలకాలని నేతలు ప్రజల్ని కోరుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన వస్తుందని వివరిస్తున్నారు.  రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో  న‌వ‌ర‌త్నాల కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరచిన నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.  ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని భ‌రోసా క‌ల్పిస్తున్నారు. 
Back to Top