రాజన్న బాట‌రైతును రాజుగా చూడాలనుకున్న వాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రైతు కన్నీరు పెట్టకుండా బతకాలని కోరుకున్నవాడు రాజశేఖర్ రెడ్డి. వ్యవసాయం పండుగ కావాలని, అన్నదాత ఆత్మహత్యకు అవకాశమే ఇవ్వరాదని అనుక్షణం తపించిన రైతుబాంధవుడు రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయన పరిపాలనా కాలం అంతా రైతుల కోసమే పాటుపడ్డాడు. ఉచిత కరెంటు ఇచ్చినా, కరెంటు బిల్లులు మాఫీ చేసినా, ప్రాజెక్టులు శరవేగంగా కట్టినా అన్నీ వారికోసమే. కర్షకుడి కష్టాన్ని దూరం చేయడం కోసమే. మరి అలాంటి నాయకుడి కడుపున పుట్టిన కొడుకుకు, ఆ నాయకుడి ఆశయాలనే ఆచరణలో చేసి చూపాలనుకునే ఇతరులకు రైతులంటే ప్రేమ ఉండకుండా పోతుందా? అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు వడ్డీ లేని రుణాలు, ఏటా పెట్టుబడి నిధి, ఉచిత బోర్లు, 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిథి, గిట్టుబాటుధరలు, పగటి పూటే 9 గంటల ఉచిత కరెంటు ఇలా ఎన్నో హామీలు అందించారు. 
తమ నాయకుడి బాటలో, రాజన్న ఆశయాల దారిలో పయనించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రైతు విలువను మరిచిపోలేదు. వ్యసాయాన్ని మరువకూడదని, ప్రజలంతా కడుపునిండా తినాలని ఆలోచించి రాజన్న రైతుబజార్ ప్రారంభించారు. కనీసం 50 రూపాయిలు ఖర్చే చేయనిదే కేజీ కూరగాయాలు కొనలేకుండా ఉన్న ఈ రోజుల్లో 10లకే కిలో కూరలు అందించే చౌక రైతుబజారును ప్రారంభించారు. స్వయంగా తానే ఓ రైతు బిడ్డ కనుక రైతుల పంట పొలాలనుంచే నేరుగా కూరగాయలను కొనుగోలు చేసి మార్కెట్ కు తరలించే శ్రమ తప్పిస్తున్నారు. రవాణా ఛార్జీలు కలిసి వచ్చి రైతులు ఆనందిస్తున్నారు. ఇక రాజన్న రైతు బజార్ ద్వారా లాభం ఆశించకుండా 10 రూపాయిలకే కిలో కూరగాయిలు ప్రజలకు అందిస్తున్నారు. 
ప్రజాసంక్షేమం, రైతు సంతోషం ఈ రెండు ఉన్నచోటే సౌభాగ్యం ఉంటుంది. మూడుపంటలు పండే భూములను బలవంతంగా లాక్కుని రియలెస్టేటు వ్యాపారం చేసే నాయకులన్న ఈరోజుల్లో రాజన్న ఆశయాలను భుజాలకెత్తుకుని రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ఈ నేతలు నిజంగా రాజన్నబిడ్డలు....
 
Back to Top