ప్రజాప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం..!ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మున్ముందుకు..!
గుంటూరుః ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందరినీ ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షను ఆపలేరని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. హోదా సాధించేవరకు విశ్రమించబోనని వైఎస్ జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కంకణబద్దులై ఉన్నారు. జననేతకు బాసటగా రాష్ట్ర ప్రజానీకం కదం తొక్కుతోంది.
నిరంతర పోరాటం..!ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్ జగన్ నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టిన వైనంపై గళమెత్తారు. ఓటు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడంతో..రాష్ట్రాభివృద్ధికోసం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆబాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఈక్రమంలోనే హోదా కోసం ఆయన చేయని పోరాటం లేదు.
ఎగతాళి చేసిన నోళ్లు మూతబడేలా..!వాగ్ధానాలు నెరవేర్చాలని పలుమార్లు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చేలా చూడాలని రాష్ట్రపతిని కలిసి విన్నవించారు. మంగళగిరిలో రెండ్రోజుల దీక్ష, ఢిల్లీలో మహా ధర్నా, రాష్ట్ర బంద్ చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. పచ్చప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో ప్రత్యేకహోదా తీర్మానానికి ఆమెదముద్ర వేయించారు. తిరుపతి, విశాఖలో నిర్వహించిన యువభేరిలో విద్యార్థులు, యువతకు... రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగఅవకాశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. హోదా సంజీవని కాదు అని చంద్రబాబు అండ్ కో ఎగతాళి చేసినా... హోదాయే రాష్ట్రానికి సంజీవని అని ఎలుగెత్తారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను తెలియజెప్పి ప్రజలందరినీ మేలుకొల్పారు. ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతబడేలా చేశారు.
చంద్రబాబు అండ్ కో కుట్రలు..!కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక లేకపోవడంతో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. హోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందన్న భయంతో పచ్చనేతలు వైఎస్ జగన్ పోరాటాలకు అడగడుగునా ఆటంకాలు సృష్టించారు. బంద్ పై దాదాగిరి చేశారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్నీ విఫలమవ్వడంతో తోకముడిచారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక పచ్చపార్టీ పోలీసులను అడ్డుపెట్టుకొని దీక్షను అడ్డుకుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరు ఆగదని వైఎస్సార్సీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. అక్టోబర్ 7నుంచి వైఎస్ జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేసి తీరుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.