రైతుల తరపున రైతు బాంధవుడి తనయుడు

రైతుల తరపున పోరాడుతున్న జన నేత
బలవంతంగా భూములు లాక్కోవటానికి వ్యతిరేకత
పోర్టు బాధితులకు బాసట

మచిలీపట్నం: క్రిష్ణా జిల్లా బందరు పోర్టు పేరుతో బలవంతంగా భూములు లాక్కోవటాన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక రకాల పేర్లతో వేల కొద్దీ ఎకరాల భూమిని తీసుకొనేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు వైెఎస్సార్సీపీ బాసటగా నిలుస్తోంది.

ఇన్ని వేల ఎకరాలు అవసరమా...
బందరు పోర్టు కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఎవరూ కాధనలేదు కానీ, 30వేల ఎకరాల దాకా భూములు లాక్కెోవాలని నిర్ణయించటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే 14 వేల ఎకరాల భూముల్ని లాక్కొనేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బందరు చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికే రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు వైెఎస్సార్ సీపీ బాసట
బలవంతంగా భూములు లాక్కోవటాన్ని వైెస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ స్వయంగా పర్యటిస్తున్నారు. నేరుగా రైతులతో మాట్లాడటం ద్వారా వాళ్లలో స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top