ఉత్సాహంగా ఉద్యమిస్తున్న యువజనం

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన
బంద్ లో, నెల్లూరు యువ భేరి వేదికలో వైయస్సార్సీపీ యువజన విభాగం కార్యకర్తలు
చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలు
పంచుకొంటున్నారు.


ఉత్సాహంగా సాగిన కార్యవర్గ భేటీ

ఇటీవల గుంటూరు నగరంలో వైయస్సార్సీపీ యువజన
విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షునిగా
జక్కంపూడి రాజా బాధ్యతలు స్వీకరించాక నిర్వహించిన మొదటి సమావేశం ఇది. 


ఇందులో
రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నగరాల నుంచి ఆయా విభాగాల ప్రతినిధులు, యువజన నాయకులు
హాజరు అయ్యారు. పార్టీ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా యువజన
కార్యకర్తలు, నాయకులకు జక్కంపూడి రాజా దిశా నిర్దేశం చేశారు. పార్టీ
కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని సూచించారు.


స్టాల్స్ ఏర్పాటు

వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు,
కార్యకర్తల్ని సమన్వయం చేసేందుకు దీన్ని ఉద్దేశించారు. పార్టీ సాహిత్యం,
సిద్ధాంతాన్ని తెలియపరిచే పత్రాలు, కరపత్రాల్ని అందుబాటులో ఉంచారు. పార్టీ డిజిటల్
మీడియా విభాగం ప్రతినిధి వెంకట్ వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్ ల పనితీరుని వివరించారు.
దీంతో పాటుగా ఆయా వెర్షన్ ల వివరాల్ని అందరికీ తెలియచేశారు. పార్టీ డిజిటల్ మీడియా ద్వారా అందుతున్న సేవల్ని సమగ్రంగా తెలియచేశారు.  ప్రాంగణం దగ్గర
ఏర్పాటు చేసిన ఇతర స్టాల్స్ లో పార్టీ కార్యాచరణ సామగ్రిని అందుబాటులో ఉంచారు.

క్యాడర్ కు దిశానిర్దేశం

“వైయస్సార్సీపీ సిద్దాంతాలను ప్రజల్లోకి
తీసుకెళ్లేందుకు యువజన విభాగం కష్టించి పనిచేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి ఫీజు
రీయింబర్స్ మెంట్ ను ప్రవేశ పెడితే, నేటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని సరిగ్గా అమలు
చేయకుండా ఆటలు ఆడుతోంది. ప్రతీ ఏటా డీఎస్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, కనీసం
నోటిఫికేషన్ కూడా ఇవ్వటం లేదు. కేవలం దోచుకోవటం, దాచుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు
ప్రభుత్వం పనిచేస్తోంది” అని జక్కంపూడి రాజా
వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాల్ని
స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొంటూ పనిచేయాలని రాజా ఉద్బోధించారు.

ఈ క్రమంలో యువజన విభాగం కార్యకర్తలు, నాయకులు
క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ నిర్వహించిన బంద్, యువభేరి సన్నాహాల్లో
చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 

Back to Top