పట్టిసీమ ఫలితం ఏమిటి చంద్రబాబూ

పట్టిసీమ పథకం ముందుకు మూడు అడుగులు వెనక్కి ఆరు అడుగులు గా నడుస్తోంది. కాంట్రాక్టర్ కు కాసులు కురిపించేందుకు ఉద్దేశించిన  ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నానా అగచాట్లు పడుతోంది.

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి పథకాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు పదే పదే ప్రకటించారు. కానీ అప్పటికి ఏ మాత్రం పనులు పూర్తి కాలేదు. ఈ లోగా ఏడాది లోగా పథకం పూర్తయితే కాంట్రాక్టర్ కు 16 శాతం మేర అదనంగా చెల్లిస్తామని ఒప్పందం చేశారు. కాంట్రాక్టర్ల కు చెల్లింపులు జరగాలంటే పని పూర్తయింది అని పించాలి కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది.

దీని ప్రకారం ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పనులు ఏమాత్రం పూర్తి కాకపోయినా సరే, ఒక స్థూపం నిర్మించేసి దాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పచ్చ మీడియాలో బోలెడు కథనాలు రాయించేసుకొన్నారు. తర్వాత ఒక శుభ ముహుర్తం పెట్టుకొని నదుల అనుసంధానం చేస్తున్నట్లు మళ్లీ ప్రచారం చేయించుకొన్నారు. తాడిపూడి జలాశయం నుంచి నీళ్లు మళ్లించి అపర భగీరథుడిలా పేరు కొట్టేశారు. రాయల సీమ నుంచి పంపులు తరలించి నీళ్లు తోడటం మొదలెట్టారు. చెంబుడు నీళ్లు క్రష్ణా నదిలో పోసి నదుల అనుసంధానం అయిపోయింది అనిపించారు.

బ్రహ్మాండం బద్దలు అయిపోయింది అని నమ్మించేందుకు ప్రతీ జిల్లా నుంచి రైతుల్ని పిలిపించి పట్టి సీమ యాత్ర పేరుతో మరో ప్రచారం కార్యక్రమం చేసుకొన్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాకు 50 లక్షల చొప్పున మొత్తం ఆరున్నర కోట్లు హారతి కర్పూరంలా హరించుకొని పోయాయి. అసలు నీళ్ల అనుసంధానం జరగక పోయినా ఏదో ఒక రకంగా పేరు కొట్టేయాలని తాపత్రయ పడ్డారు.

ఇంత చేసినా కానీ, పట్టి సీమ పేరుతో ఎత్తిపోతల పథకం ఏమాత్రం సాకారం కాలేదు. కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవటంతో అక్కడికక్కడ నీళ్లు వ్రధా అయిపోతున్నాయి. దీంతో నీటిని మళ్లించటం సాధ్యం కావటం లేదు. జాతికి అంకితం చేసి రెండున్నర నెలలు గడుస్తున్నప్పటికీ ఫలితం మాత్రం అందటం లేదు. 
Back to Top