కడప : రాయల సీమను విష జ్వరాలు వణికిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో జ్వరాలు అంతకంతకూ ప్రబలుతున్నాయి. పారిశుద్య కార్మికులు ఇటీవల సమ్మె చేసినప్పుడు చెత్త చెదారం పేరుకొనిపోయాయి. కానీ సమ్మె తర్వాత వాటిని తొలగించేట్లుగా మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు. మునిసిపల్ మంత్రిగారు రాజదాని పనుల్లో పడి శాఖ పని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అధికారులు కూడా సమ్మెను విరమింప చేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి. ఇటు, గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో తాగునీరు కలుషితం అయ్యింది. దీంతో కలుషిత నీటితో జ్వరాలు విస్తరిస్తున్నాయి. సురక్షిత తాగునీరు దొరికే అవకాశం అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో చెరువులు, కుంటల్లోని నీటిపై జనం ఆధార పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేసింది. దాదాపు 37 వందల పైచిలుకు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మలేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. డెంగీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా చోట్ల చికెన్ గున్యా, టైఫాయిడ్ కేసులు కూడ నమోదు అవుతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులే ఇలా ఉన్నాయి. సీమలో విష జ్వరాల తాకిడి డెంగీ అనుమానిత కేసులు డెంగీ నిర్థారిత కేసులు మలేరియా కేసులువైఎస్సార్ కడప జిల్లా - 152 - 86 - 126అనంతపురం జిల్లా - 580 - 92 - 201చిత్తూరు జిల్లా - 303 - 132 - 44కర్నూలు జిల్లా - 185 - 08 - 93 ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కేసుల లెక్కలు. ప్రైవేటు ఆసుపత్రుల, వైద్యుల దగ్గర చికిత్స తీసుకొంటున్న వారి సంఖ్య అనేక రెట్లు ఉంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవటం లేదు.విష జ్వరాల అదుపు చేయలేక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.