ఎమ్మెల్యే రోజా టాప్ టెన్ కామెంట్స్

హైదరాబాద్)
చంద్రబాబు ప్రభుత్వం అరాచకాల మీద మహిళా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శాసనసభలో
సస్పెన్షన్ మీద న్యాయ పోరాటం చేస్తున్న ఆమె... హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన
కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా  చేసిన పవర్ ఫుల్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.

 

1.చేయని తప్పునకు క్షమాపణ చెప్పాల్సిన పని
లేదు. తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

2.ప్రభుత్వ తప్పిదాల్ని, అరాచక పనుల్ని బయట
పెట్టి నిలదీస్తున్నందుకే నన్ను సస్పెండ్ చేశారు.

3.ఇది అధికార టీడీపీ పురుష దురహంకారానికి,
ఒక మహిళకు మధ్య జరుగుతున్న పోరాటం

4.రికార్డులు బయటకు తీస్తే బండారం బయట
పడుతుంది. ఎవరు తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు, 
ఎవరు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది.

5.సీఎం ఉంటున్న ఇంటికి దగ్గరలోనే కాల్ మనీ
సెక్సు రాకెట్ పేట్రేగుతోంది. దీన్ని ప్రశ్నించినందుకే కక్ష కట్టి సస్పెండ్
చేయించారు.

6.అసెంబ్లీకి న్యాయం కోసం వస్తే మార్షల్స్
తో గెంటించేశారు. ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధ పడ్డారు.

7.అధికారం కోసం ఎన్టీఆర్ ను వెన్నుపోటు
పొడిచిన ముఠా... వంగవీటి మోహనరంగాను చంపించిన ముఠానే...
ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసింది.

8.సెక్సు రాకెట్ కు పాల్పడిన వారంతా
చంద్రబాబు పక్కనే కూర్చొంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. సినిమా ఆడియో ఫంక్షన్
లో మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే ..అదంతా మహిళల్ని సంతోష పరచడానికే అని
ఎమ్మెల్యే అనిత అంటున్నారు.

9.టీడీపీ ఇచ్చే వీడియోల్ని ప్రసారం
చేస్తున్న చానెల్స్ ను శిక్షించరా?... కామ అంటూ హెడ్డింగ్ పెట్టిన పత్రికను ఏమీ
అనరా?.. కానీ వాటిని ప్రస్తావించినందుకు నన్ను శిక్షిస్తారా?... ఇదేమీ న్యాయం...!

10.                 
మంత్రి పదవుల కోసమే ప్రతిపక్షం మీద టీడీపీ నాయకుల దూషణలు.
కావాలంటే వాటిని మీరే ఎంజాయ్ చేసుకోండి. 

తాజా ఫోటోలు

Back to Top