స్టాచ్యూ ఆఫ్‌ పిటి..పాపం... ఎన్‌టీఆర్‌!

 

తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిందని నాడు ఎన్టీరామారావు మండిపడ్డారు.
ఆత్మగౌరవం నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడు ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్‌పార్టీనేనని...ఎన్టీయార్‌ ...దిక్కులు పిక్కటిల్లేలా...గగనాంతరాలు దద్దరిల్లేలా చాటారు. అప్పుడు అల్లుడు చంద్రబాబుగారు ఆ కాంగ్రెస్‌లోనే వున్నారు. అప్పుడు మామాగారి మాటల్నీ చాలా లైట్‌గా తీసుకున్నారు. అది చాలదన్నట్టు మామ మీదే పోటీచేస్తానని ప్రగల్భాలు పలికారు. ఎన్టీయార్‌తో పోటీమాట దేవుడెరుగు...మామూలు పోటీదారు చేతిలోనే ఘోరంగా దెబ్బతిని ..ఎన్నికల్లో ఓడిపోయారు. అది అప్పటి సమయం. సందర్భం. జరిగిన సంఘటన.
బాబుగారు అక్కడితో ఆగేవారా? కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినది ఆలశ్యం..పెట్టాబేడా సర్దేసుకుని...మామగారి తెలుగుదేశం గూటిలోకి దూరిపోయారు. బిక్కుబిక్కుమంటూనే కాలం గడిపినట్టు కనిపిస్తూ...లోలోపల పాము పన్నాగాలే పన్నారు. చివరాఖరుకు టీడీపీలోనే ఏకు మేకయ్యారు. మేకు మారిన బాబు ఏకంగా కత్తిలా ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచేశారు. పదవీచ్యుడిని చేసేశారు. పాపం, ఎన్టీయార్‌ కష్టార్జితాన్నంతా దోచేశారు. దోచేస్తే దోచేశాడు గానీ. పార్టీ సిద్దాంతాలను, విలువల్ని ...అన్నీ బట్టలూడదీసేసినట్టు...ఊడదీసేశారు. బాబుగారు అలా ’అకాల’ పెద్దమనిషై కూర్చున్నారు. చెట్టంత ఎన్టీయార్‌ కృంగి కృశించి నశించి ’పోయారు’. 
అప్పట్నుంచి ఇప్పటిదాకా...పాపం పండక్కి, పబ్బానికి పెద్దలకు కొత్త బట్టలు పెట్టినట్టు..ఎన్టీయార్‌గారి ఫోటోకు దండేసి, దండం పెడుతూనే వున్నారు శ్రీమాన్‌ చంద్రబాబుగారు. అది అక్కడికే సరి. పార్టీ సిద్దాంతాలన్నీ మటుమాయమయిపోయారు. ’ఆత్మగౌరవం’ మాట భేతాళుడి కథలోని శవంలా చెట్టెక్కి కూర్చుంది. ఏగూటికాడ ఆ పాట పాడటం...అవసరం కొద్దీ పొత్తులతో రాజకీయం నడపడం అలవాటయిపోయి, బాబుగారు చేయని అవినీతి లేదు. అక్రమార్జనకు అంతులేదు. అన్యాయాలకు హద్దేలేదు. అలా టీడీపీని ...తెలుగు ద్రోహుల పార్టీగా మార్చేశారు. తెలుగుప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడుతూ...తను ప్రయోజనాలు పొందడమే పరమావధిగా.... నలభైఏళ్ల రాజకీయం బాబు భావిస్తూనేవున్నాడు.  ఆయనగారు చేసిన పాపాలు తెలియనిదెవరికి? ఆయన పాపాలకు బలకాని వారెవ్వరు? అందరికన్నా...ఆంధ్రరాష్ట్రప్రజలు ఎంతగా నష్టాపోయారో చెప్పాలంటే...ఆకాశమంత పేపర్‌ కావాలి. నల్లమబ్బులన్నీ కరిగించి, ఇంకుగా చేసినా... ఆ క్షుద్రరాజకీయం మొత్తం రాయడానికి సరిపోదు.
ఇప్పుడిక తాజాగా తెలుగువాడి ఆత్మగౌరవంతో దాగుడుమూతల రాజకీయాలాడిన చంద్రబాబు...తన రాజకీయజీవితానికి క్లైమాక్స్‌గా ఏకంగా....ఆత్మగౌరవానికే వెన్నుపోటు పొడిచాడు. కాంగ్రెస్‌ చంకనెక్కి కూర్చున్నాడు. 
తెలుగుదేశం పార్టీకి, ఇప్పటిదాకా అంతోఇంతో రక్షణకవచంగా కాపాడిన ఆత్మగౌరవం విలువను, వలువలా తీసేసి...తన అవసరరాజకీయాల పొత్తుకు కప్పారు.  í
పిటీ టీడీపి. 
అయ్య, బాబోయ్‌...అల్లుడా...మజాకానా?!
నమ్మిసెడి ’పోయారు’ పాపం ఎన్టీయార్‌. ఇప్పుడుంటే మరోసారి పోయేవారు.
ఆయన ఆత్మకు... మరోసారి శోకతప్త నివాళి!!
 
Back to Top