ఎందుకీ కుట్ర‌

వైఎస్సార్ మీద ప‌దే ప‌దే కుట్ర‌లు
అసెంబ్లీ నుంచి చిత్ర‌ప‌టం తొల‌గింపు
ప్ర‌జ‌ల మ‌నస్సులో సుస్థిర స్థానం

హైద‌రాబాద్‌: అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టం తొల‌గింపు మీద ప్ర‌భుత్వం కుంటి సాకులు చెబుతోంది. అసెంబ్లీ సాక్షిగా ఈ అంశం మీద వైఎస్సార్‌సీపీ నిల‌దీసింది.

అదే కుట్ర‌లు
తెలుగుదేశం పార్టీకి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే హ‌డ‌ల్‌. చంద్ర‌బాబు చేసిన కుట్ర‌లు, కుయుక్తుల్ని తిప్పి కొట్టిన ఘ‌న‌త వైఎస్సార్ ది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ను చిత్తు చిత్తుగా ఓడించారు. ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గని ముద్ర వేసుకొన్న మహా నేత ఆయ‌న‌. అయితే ఆయ‌న్ని గుర్తించుకొంటే క‌ష్టం అని బావించిన తెలుగుదేశం కుట్ర‌లు సాగించింది. అనేక ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో వైఎస్సార్ పేరు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతోంది.

చిత్ర ప‌టం తొల‌గింపు
ప‌ద‌విలో ఉండ‌గా మ‌ర‌ణించిన ఏకైక ముఖ్య‌మంత్రిగా వెఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని చెబుతారు. అందుకే ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని అసెంబ్లీ లాంజ్ లో ఉంచాల‌ని గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని అప్ప‌టి స్పీక‌ర్ స్ప‌ష్టం చేయ‌టం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అసెంబ్లీ వ‌ర్గాల మీద ఒత్తిడి తెచ్చింది. ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని తొల‌గించేందుకు కుట్ర పన్నింది. దీంతో సాకులు చెబుతూ అసెంబ్లీ వ‌ర్గాలు వైఎస్సార్ చిత్ర‌ప‌టాన్ని అక్క‌డ నుంచి తొల‌గించటం జ‌రిగింది.

ప్ర‌జ‌ల మ‌న‌స్సులో సుస్థిర స్థానం
ఇన్ని కుట్ర‌లు చేసినా ప్ర‌జ‌ల మ‌నస్సులో వైఎస్సార్ స్థానం సుస్థిరం అన్న విష‌యాన్ని గుర్తించ లేక‌పోయారు. దివంగ‌త నేత చిత్ర‌ప‌టాన్ని తిరిగి అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేయాల‌ని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేర‌కు స్పీక‌ర్ కు విన‌తి ప‌త్రం స‌మర్పించింది. అయిన‌ప్ప‌టికీ చ‌ర్య‌లు శూన్యం. దీని మీద ఇవాళ అసెంబ్లీలో గ‌ట్టిగా వాదించ‌టం జ‌రిగింది. ఎన్ని కుయుక్తులు ప‌న్నినా జ‌నం గుండెల్లోంచి వైఎస్సార్ ను తొల‌గించ లేర‌ని గుర్తు చేశారు.
Back to Top