చంద్ర‌బాబు క‌ర‌వు క‌వ‌ల పిల్లలు

రాష్ట్రంలో క‌న్నీటి క‌ర‌వు
క‌మ్ముకొన్న క‌ర‌వు మేఘాలు
వాన‌లు వ‌చ్చే చాన్సు త‌క్కువే
రైతుల్ని గాలికి వ‌దిలేసిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌: ఆంధ్రప్ర‌దేశ్ అంత‌టా క‌ర‌వు క‌మ్ముకొంది. వ‌ర్షపాతంలోటు 8 శాతంగా న‌మోదంఐది. దీంతో 13 జిల్లాల్లోనూ పంట ప‌డ‌కేసింది. 

క‌మ్ముకొస్తున్న  క‌ర‌వు
ఖ‌రీఫ్ సీజ‌న్ లో క‌ర‌వు ల‌క్ష‌ణాలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. సీజ‌న్ లో ఇప్ప‌టిదాకా 412.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోద‌వ్వాల్సి ఉంది. కానీ, ఇప్ప‌టిదాకా 378.4 మి.మీ. మాత్ర‌మే వ‌ర్షాలు ప‌డ్డాయి. దీంతో చాలా చోట్ల పంట సాగు కుంటుప‌డింది. దాదాపు 42 ల‌క్ష‌ల హెక్టార్ల మేర పంట సాగు కావాల్సి ఉండ‌గా, ఇప్ప‌టి దాకా 28 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో మాత్ర‌మే సాగు జ‌రుగుతున్న‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. దీంతో రైతు ఆందోళ‌న చెందుతున్నాడు.

వాన‌లు వ‌చ్చే చాన్సు
సెప్టెంబ‌ర్ లో కూడా వాన‌లు ప‌డే అవ‌కాశం త‌క్కువ అన్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఓ మాదిరి వాన‌లు  ప‌డితే పంట చేతికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ ప్ర‌స్తుతం అటువంటి సూచ‌న‌లు క‌నిపించ‌టం లేదు. ఆహార ధాన్యాల‌కు ఆయువు ప‌ట్ట‌యిన కృష్ణా డెల్టాకు నీరు అంద‌డం లేదు. అటు గోదావ‌రి డెల్టాలో కూడా ప‌రిస్థితి అంత బాగో లేదు. రాయ‌ల సీమ లో అయితే ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది.

ప‌ట్టించుకోని స‌ర్కారు
ప్ర‌భుత్వం మాత్రం క‌ర‌వు మీద నిర్దిష్ట చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. రైతులు మీద మాటల్లో  ప్రేమ ఒల‌క బోస్తున్న‌ప్ప‌టికీ వాస్త‌వం చేదుగా ఉంది. రైతుల‌కు క‌ర‌వు ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు ఏ మాత్రం చేప‌ట్టారు అనేది స్ప‌ష్టం గా చెప్ప‌టం లేదు. వ్య‌వ‌సాయ మంత్రి ఈ విదుల్ని గాలికి వ‌దిలేసి, రాజ‌ధాని కోసం భూముల్ని లాక్కోవ‌టం మీద‌నే ఎక్కువ శ్ర‌ద్ద చూపుతున్నార‌న్న మాట ఉంది. దీంతో రైతుకు అండ క‌ర‌వు అవుతోంది. 
Back to Top