జ‌న‌నేత వెంటే జ‌న‌మంతా- సీ ఓటర్‌ సర్వేలో వైయ‌స్ఆర్‌ సీపీదే పైచేయి
 - ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 21 లోక్‌సభ సీట్లు కైవసం
- 4 స్థానాలకు టీడీపీ పరిమితం
- 9% ఓట్లను కోల్పోనున్న అధికార పార్టీ  

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మొన్న‌టి స‌ర్వే, నిన్న‌టి స‌ర్వేలు ఇవే చెబుతుండ‌గా తాజాగా మ‌రో స‌ర్వే కూడాలో కూడా ఇదే విష‌యం వెల్ల‌డైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్‌ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైయ‌స్ఆర్‌సీపీ , టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైయ‌స్ఆర్‌సీపీ కి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.  

అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్‌ సర్వేలో వైయ‌స్ఆర్‌ సీపీదే పైచేయిగా కనిపించింది. వైయ‌స్ఆర్‌ ర్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. నాడు వైయ‌స్ఆర్‌ సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top