‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసే సమయానికి 79 రోజులు, 1,115.8 కిలోమీటర్లు
గుంటూరు : ‘మన రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోంది. రైతన్నలు అప్పులు కట్టలేక చివరికి తమ కిడ్నీలు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. చంద్రబాబు హయాంలో కూడా గుంటూరు జిల్లా రైతులు అప్పులు కట్టడానికి కిడ్నీలు అమ్ముకున్నారట.. ప్రస్తుతమూ మన రాష్ట్రంలో నడుస్తున్నది బాబు పాలన రెండో భాగం..’ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతూ మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. రాజుపాలెం, రెడ్డిగూడెంలలో ఆమె రైతులు, మహిళలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అప్పులు భరించలేక కిడ్నీ అమ్ముకున్నానని ఓ రైతు శ్రీమతి షర్మిలకు చెప్పడంతో ఆమె చలించిపోయారు. ‘చాలా బాధనిపించింది. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఇక్కడి రైతులు కిడ్నీలు అమ్ముకుంటే... రైతులు జల్సాలు చేయడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారట. వైయస్‌ఆర్ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. రైతన్నలకు ఒక మాట చెప్తున్నా.. త్వరలోనే జగనన్న వస్తాడు. రాజన్న రాజ్యం తెస్తాడు. ప్రతి రైతు పక్షాన నిలబడతాడు. అంత వరకు ఓపిక పట్టండి. దయచేసి మీ అవయవాలను, భూములను అమ్ముకోద్దన్నా..’ అని శ్రీమతి షర్మిల కోరారు.
శనివారం 79 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నాగిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి గంగిరెడ్డిపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం, మీదుగా ధూళిపాళ్ల చేరింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. శనివారంనాడు ఆమె మొత్తం 15 కిలోమీటరల్ దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1115.8 కిలోమీటరల్ పాదయాత్ర పూర్తయ్యింది.
శనివారంనాటి పాదయాత్రలో పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, ఆర్.కె., అంబటి రాంబాబు, తలశిల రఘురామ్, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్, పి.గౌతంరెడ్డి, స్థానిక నేతలు కావటి మనోహర్ నాయుడు, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు మాదిగ ఉన్నారు. సాయంత్రం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి శ్రీమతి షర్మిలతో కాసేపు ముచ్చటించారు.