ఒక ధిక్కారం...ఒక ఉల్లంఘన...నిజ‌మా?

 

ఇవి 2010లో వై.ఎస్‌.జగన్‌పై  ప్రత్యర్థులు విసిరిన విమర్శల బాణాలు. కానీ అసలు జరిగిందేమిటి? తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడం కొడుక్కా , నా బాధ్యత అన్న జగన్‌... ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఆపమన్నారు ఢిల్లీ పెద్దలు. మాట తప్పలేనన్నాడు జగన్‌. అయితే, మ్యాటర్‌ సీరియస్‌ అన్నారు కాంగ్రెస్‌ పెద్దలు. మంచిపైనే మండిపడతామంటే...మంచిపనినే అడ్డుకుంటామంటే...అది మీ ఖర్మ అని మనసులో అనుకున్నాడో ఏమో...జగన్‌ మాటమీదే నిలబడాలనుకున్నాడు. ఎన్ని ఆటుపోట్లెదురైనా, కష్టనష్టాలు విరుచుపడినా వెనుకంజ వేయడం తన నైజం కాదనుకున్నాడు.
సరిగ్గా...ఇదే నవంబర్‌ 29, 2010లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అది ధిక్కారం కాదు. నా తండ్రికోసం నన్ను నడవనివ్వండి అన్న విజ్ఞాపన. అర్థం కాలేదు అక్కడి వారికి. చుట్టూ కోటరీ ... వారిని అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయనివ్వలేదు. ఏ ఒక్కరూ ఆసరా కాలేదప్పుడు. అమ్మ ఒక్కటే తోడయింది. దీవించింది. అమ్మ దీవెనకు మించినది ఏమి వుండదు. జగన్‌కు అదే దక్కింది. ఇక వెనుదిరిగి చూడలేదు. వెరపన్నది లేనే లేదు. 
రాజకీయ తుపానులు ముంచెయ్యాలని చూసినా, కరకుగుండెలు నలిపేయాలని ప్రయత్నించినా రాజన్నబిడ్డ తలవంచలేదు. ఆ గుండె బేజారెత్తలేదు. ఆయనపై అహంకారంతో ఉరిమిన వారే...ఆయన్ను అహంకారి అన్న నిందలేసే స్థాయికి దిగజారినా ....ఆ వైస్సార్‌ తనయుడు ప్రజాబాటనే పట్టాడు. ప్రజలతోనే తొమ్మిదేళ్లుగా కలిసి సాగుతున్నాడు. 
ఓ నాయకుడిగా...ప్రజలకోసం పరితపిస్తున్న జగన్‌ది సమకాలీన రాజకీయాల్లో ఓ విలక్షణ ముద్ర. ముప్పయిఎనిమిదేళ్ల యువకుడిగా వైయస్‌ జగన్‌ నాడు తీసుకున్న నిర్ణయం...నిజంగా ఓ సాహసికే సాధ్యం. తేరగా తిని పడుకుని, ప్రజాసేవంటూ సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే రాజకీయబాపతులు అర్థం చేసుకోవడం అసాధ్యం. 
2010 నవంబర్‌ 29 నుంచి జగన్‌ జీవనప్రస్థానం...రాజకీయ ప్రస్థానం తెరచిన పుస్తకం. ప్రజలందరి మధ్యనే నడుస్తున్న నిజం. ప్రజాసమస్యలపై పోరాటాలు, ప్రత్యేకహోదా కోసం దీక్షలు...ఏదీ చేసినా ఒకటే తపన. ఒకటే ధ్యేయం. అంతిమంగా  ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం కలగడం. జగన్‌ నడుస్తున్నాడు. ప్రజాసంకల్పయాత్ర ...ప్రజా జైత్ర యాత్రలా సాగుతోంది. ప్రజలకోసం పరితపించే వైయస్‌ జగన్‌...రేపటి రోజున పరిపాలనా దక్షతలోనూ తిరుగులేని నేతగా నిలిచితీరుతాడన్నది రాజకీయ,సామాజిక వర్గాల విశ్లేషణ. అడుగడుగునా ...ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్న లక్ష్యాన్ని ప్రకటిస్తున్న రాజశేఖరుడి తనయుడు... సూటిగానే తన రాజకీయ ఎజెండాను ప్రకటిస్తున్నారు. రాష్ట్రప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాభివద్ది ఇవే తన రాజకీయ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యాలని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఆ విషయంలో రాజీలేని పోరాటమే చేస్తున్నా...అధికార పక్షం ఇంకా తన బురదచల్లే రాజకీయాలను చేస్తూనే వుంది. నిన్నటి దాకా పిల్లకాంగ్రెస్‌ అని జగన్‌ పార్టీని ఎగతాళి చేస్తూ వచ్చిన శ్రీమాన్‌ చంద్రబాబుగారు, ఇప్పుడు తనే ఆ పార్టీ చంకనెక్కి కూర్చున్నారు. కూర్చున్నవాడు కూర్చోక...మళ్లీ జగన్‌ మీద రివర్స్‌లో విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపి ఫ్రెండ్‌ జగన్‌ అంటున్నారు. ఆయన వ్యవహారమంతా తిరకాసే. అది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్న మరుక్షణం ఆయన రాజకీయానికి చరమాంకం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మార్పు రావాలి. అందుకు సవాలక్ష కారణాలు చెప్పొచ్చు. దాదాపు అందరికీ తెలిసినవే. ఆ మార్పు దిశలో మేలు మలుపు ....మాటిమాటికి జగన్‌ చెబుతున్న ’మనందరి ప్రభుత్వం’.   

 
Back to Top