ఒడిశాలో అభయ హస్తం..సిక్కోలులో రిక్త హస్తం...



మరోసారి బోధపడిన చంద్రతత్వం..
బాబూ.. ఒడిశా సీఎంను  చూసి బుద్ధి తెచ్చుకో...
మాటలు గారిడీలతో ఘన కిర్తీ సంపాదించిన  సీఎం చంద్రబాబు తిత్లీ తుపాన్‌ను ఎదుర్కోవడంలో పక్కనున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను చూసైనా బుద్ధితెచ్చుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స‌ల‌హా ఇస్తున్నారు. తుపాన్‌ను కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న  చంద్రబాబు సిగ్గుమాలిన వైఖరి అంత ఇంత కాదు.
మాటలే తప్ప పనుల చేతకాని సీఎం చంద్రబాబు..తుపాను ప్రభావిత ప్రాంతాలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కార్యకర్తలపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రతత్వం ఏపీ ప్రజలకు మరోసారి బోధపడింది. తిత్లీ తుపాను ప్రభావం మన రాష్ట్రం కన్నా ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ చూపింది. సుమారు 17 జిల్లాలు తుపాన్‌ ధాటికి అతలాకుతలం అయ్యాయి. పెనునష్టం సంభవించింది. మన ఆంధ్ర సిఎం చంద్రబాబు మాదిరి ఒడిశా సీఎం హడావిడి, ప్రచారం చేయలేదు. కేవలం పని మాత్రమే చేశారు. ఒక్కసారి మాత్రమే తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషితో వారం రోజుల్లోనే తుపాను ప్ర‌భావిత‌ ప్రాంతాలను  కోలుకోనేలా చేశారు. తుపాన్‌ అతలాకుతలం చేసిన వెంటనే ఆ రాష్ట్ర విపత్తుల సంస్థ నుంచి రూ. 750 కోట్లు విడుదల చేసి వెంటనే పునరావాస, సాయం అందించే ఏర్పాటు యుద్ధప్రాతిపదికన చేసింది. రోడ్లు పునర్మించడంతో పాటు, తాగునీటి,విద్యుత్‌ వంటి సౌకర్యాలను పునరుద్దరించారు. కేవలం వారం రోజులనే యథాస్థితి తీసుకొచ్చారు. ఒడిశాలో జరిగింది ఇది.. మరి మన రాష్ట్రంలో ఏం జరిగింది. పబ్లిసిటీ పిచ్చి, మసిపూసి మారేడుకాయ చేసే నైజం ఉన్నా చంద్రబాబు అదే  చేద్దామని తుపాన్‌ బాధితుల చేత ఛీ అనిపించుకున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయం కన్నా ముందు చంద్రబాబు ప్లెక్సీలు వెలిశాయి. టీడీపీ నేతలు ఎవరు వెళ్ళిన బాధితులు తరిమికొట్టిన సంఘటనలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు బాధితులకు అందాల్సిన రిలీఫ్‌ఫండ్‌ను కూడా దోచుకుంటున్నారు. శవం మీద కూడా చిల్లర ఏరుకునే రకం పచ్చ చొక్కాలది. సిక్కోలు పరిస్థితి ఏవిధంగా ఉందంటే  ఇప్పటి దాకా బాధితుల ఆర్తనాదాలే తప్ప ఆదుకున్నా దాఖలాలు లేవు. ఒక్క శ్రీ‌కాకుళం జిల్లాలోనే రూ.3435 కోట్ల ఆస్థి న‌ష్టం జ‌రిగితే..ఇంత‌వ‌ర‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.500 కోట్లు మాత్ర‌మే..ఒక్కో గ్రామానికి నీటి అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ ప్ర‌భుత్వం రూ.500 చెల్లించి చేతులు దులుపుకుంద‌ట‌. ప్ర‌భుత్వం ప్రచారం తప్ప కనీసం గుక్కెడు మంచినీళ్లు ఇవ్వని పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో తుపాను బాధితులు వున్నా అక్కడ వాస్తవం మిగతా ప్రాంతానికి తెలియకుండా ఎదో సాయం జరిగిపోతుందనట్లు పచ్చమీడియా ద్వారా ఊదరగొడతారు. అక్కడ తినడానికి తిండిలేకపోయిన ప్లెక్సీల రూపంలో సాయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తారు. అంతే కాదండోయ్‌  తిత్లీ తుపాన్‌పై ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించినట్లు  సామాజిక మధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. బాధిత ప్రాంతాల్లో ఓట్లు పడకపోయిన పర్వాలేదు..మిగతా ప్రాంతాల్లో ఓట్లు రాబట్టాలని ఫొటోలకు ఫోజులిస్తూ గొప్పలు చెప్పుకోవడానికి తిప్పలు పడుతున్నా చంద్రబాబు తీరు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు..
 
Back to Top