ఏపీలో దుశ్శాశన పాలన

చంద్రబాబు పాలనలో  అన్నీ శోకాలే
వేధింపులకు నేల రాలుతున్న విద్యా కుసుమాలు 
పచ్చ కామాంధుల రాజ్యంలో మహిళలకు రక్షణ కరవు
నిందితులపై చర్యలుండవు.. రోజు గడిస్తే మీడియాలో వార్తలుండవు
కబ్జాలు అడ్డుకున్నా, అవినీతిని ప్రశ్నించినా దాడులే

ఏపీలో పరిస్థితులు యూపీని తలపిస్తున్నాయి. రౌడీయిజానికి, దౌర్జన్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఏ రాష్ట్రం అనడిగితే టక్కున చెప్పే పేరు బీహార్, ఉత్తరప్రదేశ్‌ అని. బీహార్‌లో పరిస్థితులు చాలా మారాయి. కానీ యూపీలో అలాగే ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా దాదాపు అలాంటి స్థితి కనిపిస్తుంది. బాబు రాజ్యంలో పచ్చ దొరలు చెలరేగిపోతూ మహిళల మీద పశుత్వం చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు పెద్దన్నలా ఉండి ఆదుకుంటానని నమ్మబలికిన ముఖ్యమంత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలను దేశం మీదకు వదిలి అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఆడవారిపై జరుగుతున్న దాడులకు హద్దూ అదుపై లేకుండా పోతోంది. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఎందరో మహిళలు పురుషహంకారానికి బలై నూరేళ్ల జీవితాలను సగంలోనే ముగింపు పలుకుతున్నారు. అధికారంలోకి వస్తూనే మహిళలు అన్నగా అండగా ఉంటానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లేసిన మహిళలకు భద్రత అనేది ఆకాశంలో చుక్కల్లాగే ఉంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పక్కనే ఉన్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం మహిళాలోకానికి కానరావడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పచ్చ కామందులు చేసే వికృత రాజకీయాలకు బలైన ఎందరో ఆడపడుచుల ఆత్మఘోష టీడీపీ ప్రభుత్వానికి వినిపించడం లేదు. మహిళలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం కంచే చేను మేసిందన్న విధంగా వారి మాన ప్రాణాలను కబలించి వేస్తున్నారు. నిందితులను రక్షించేందుకు మహిళల ప్రాణాలకు వెలకట్టి బాహ్య సమాజంలో మహిళల ఉద్దారకుల్లాగా ఫోజు కొడుతున్నారు. 

వివస్త్రను చేసి దళిత మహిళపై దాడి
విశాఖ జిల్లా పెందుర్తిలోని జె్రరిపోతులపాలెంలో ఎన్టీఆర్‌ గృహకల్ప పేరుతో దళితుల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన మహిళపై టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు అతి దారుణంగా వివస్త్రను చేసి దాడి చేశారు. పెందుర్తి వైఎస్‌ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త మడక అప్పల్రరాజు, మాజీ సర్పంచ్‌ పడిశల శ్రీను, ఇతర  టీడీపీ నాయకులు ఆమె దాడి చేసి వేధించారు. దుస్తులు చించేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. వీరంతా ఎమ్మెల్యే బండారు సత్యానారాయణమూర్తి అనుచరులే కావడం గమనించాల్సిన విషయం. 

విద్యాలయాలో రక్షణ కరువు

ఏపీలో మహిళలకు విద్యాలయాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. ఎందరో చదువుల తల్లులు తమ భవిష్యత్తును బంగారం చేసుకుందామని వచ్చి మగోన్మాదుల అరాచకాలకు  అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. సరస్వతీ నిలయాలుగా పేరొందిన కాలేజీలు మహిళా శ్మశాన వాటికల్లా మారుతున్నాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి కామాంధుల గుండెల్లో వణుకు పుట్టించాల్సిన పోలీస్‌ వ్యవస్థ పచ్చ బాస్‌ల కబంధ హస్తాల్లో నలిగి పోయి వారేసే బిస్కెట్లతో పొట్ట పెంచుకు తిరుగుతున్నారు. బాహ్య ప్రపంచానికి తెలిసే రిషితేశ్వరి, సంధ్యారాణి, ఉష లాంటి  ఎంతో మంది విద్యార్థినులు వేధింపులు తట్టుకోలేక తనువు చాలిస్తే తెలియకుండా ఇంకా ఎంతోమంది తమ జీవితాలకు అర్ధంతరంగా ముగింపు పలుకుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం నిందితులకు కొమ్ము కాస్తూ కేసులను నీరు గార్చేస్తున్నారు. వీరి అకృత్యాలకు బలైన సరస్వతుల ఆత్మలు న్యాయం కోసం ఘోషిస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదు. కూతుళ్లను కోల్పోయిన మాతృ హృదయాలు కన్నీరవుతున్నా ఆ పచ్చ కామందులో మార్పు రావడం లేదు. 

రిషితేశ్వరి.. సంధ్యారాణి.. ఉష.. ఇలా ఎందరో ?
కాలేజీల్లో వేధింపులకు విద్యార్థి కుసుమాలు ఒక్కొక్కరిగా నేల రాలుతున్నారు. మొన్న రిషితేశ్వరి.. నిన్న సంధ్యారాణి... నేడు ఉష ఇలా ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. 
– నాగార్జున యూనివర్సిటీలో సీనియర్‌ విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్‌ వేధింపులకు రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్‌ విద్యార్థుల వల్ల ఆమె అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టినట్టుగా తన డైరీలో అక్షర బద్ధం చేసింది. తను ఎందుకు చనిపోతున్నదీ వివరిస్తూ తల్లిదండ్ల్రులకు లేఖ కూడా రాసింది. ఆమె ఆత్మహత్యకు ప్రొఫెసర్‌ బాబూరావు కారణమంటూ  ప్రముఖంగా వార్తలొచ్చాయి. విద్యార్థులు, ప్రజా సంఘాలు ఆమె తల్లిదండ్రుకలు న్యాయం చేయాలని ధర్నాలు చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం యూనివర్సిటీకి అర్ధంతరంగా సెలవులు ప్రకటించి యూనివర్సిటీ మెస్‌ను మూయించి కేసును నీరు గార్చే కుట్రకు తెరతీశారు. అన్ని ఆధారాలున్నా నిందితులు కళ్లముందే ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. మంత్రి దేవినేని ఉమ, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రల సాయంతో బాబూరావు సంతోషంగా కేసు నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కమిటీలంటూ హడావుడి చేసి పక్కకు తప్పుకున్నారు. పైగా ఆయన అప్పట్లో ఒక సినిమా  ఆడియో ఫంక్షన్లకు వెళ్లి హడావుడి చేయడంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి కూడా. 

వైయస్ జగన్‌ కల్పించుకుంటే గానీ...

గుంటూరులోని జీజేహెచ్‌లో ప్రొఫెసర్‌ వేధింపులకు సంధ్యారాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే వివాహమైన ఆమెను తోటి విద్యార్థుల సమక్షంలో ద్వంద్వార్థాలు వచ్చేలా సూటి పోటి మాటలతో ప్రొఫెస0ర్‌ లక్ష్మి పెట్టే వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె కూడా తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ లేఖ రాసింది. అంతేకాకుండా ఆమెకు డైరీ రాసే అలవాటు ఉండటంతో నిందితురాలైన ప్రొఫెసర్‌ లక్ష్మిని పట్టుకోవడానికి పోలీసులకు అంతగా శ్రమ కూడా అవసరం లేకుండా పోయింది. అయినా ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులకు దాదాపు 20 రోజుల సమయం పెట్టింది. అదీ కూడా ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ కల్పించుకునిప్రభుత్వాన్ని హెచ్చరిస్తే తప్ప పోలీసుల్లో చలనం రాలేదు. సంధ్యారాణి తల్లిదండ్రులు వైయస్‌ జగన్‌ను కలిసిన మరుసటిరోజే ప్రొఫెసర్‌ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడం విశేషం. కానీ అన్ని రోజుల పాటు ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్‌ లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయడం గమనార్హం. 

అభినందించకపోగా వనజాక్షికి వేధింపులు..

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక అక్రమాలను నిలదీసి ప్రభుత్వ సంపదను కాపాడటానికి వీరోచితంగా పోరాడిన తహశీల్దార్‌ వనజాక్షిని  ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించకపోగా బ్లాక్‌మెయిల్‌ చేయడం పెద్ద సంచలనమే అయింది. మహిళలకు అండగా ఉంటాన న్న ముఖ్యమంత్రి ఒక మహిళకు రక్షణ కల్పించకపోయినా తన ప్రభుత్వంలో ఉద్యోగికి కూడా రక్షణ కల్పించలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సింది పోయి పనితీరు మదింపు అంటూ చింతమనేనికి ఫస్ట్‌ ర్యాంకు ఇచ్చిన చంద్రబాబు ఇలాంటి అరాచకాలకు నా అండదండలుంటాయంటూ  సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం మహిళలు ఉద్యోగుల భద్రతపై ఆయనకున్న చిత్తశుద్ధి తెలుస్తుంది. 

ప్రాణాలకు వెలకట్టే కామాంధులు

విశాఖ జిల్లాలోని అనకాపల్లికి చెందిన లావణ్య అనే వివాహిత తన ఆడబిడ్డ, భ ర్తతో కలిసి బైకుపై గుడికి వెళ్లి వస్తుండగా  కారుతో ఢీకొట్టి చంపేశారు. దాడి హేమ కుమార్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం తాగి నూకాలమ్మ గుడి  వద్ద లావణ్యతోపాటు ఆమె మరదలు దివ్వను వేధించారు.  చీవాట్లు పెట్టడంతో వారిలోని ఉన్నాది నిద్రలేచాడు. దైవదర్శనం ముగించుకుని భర్త ఆడబిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్న వారి బైకును కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి లావణ్య మృతికి కారణమయ్యారు. ఆమె ఇద్దరు బిడ్డలను అనాధలను చేశారు. దాదాపు 200 మీటర్ల దూరం లావణ్యను ఈడ్చుకుంటూ పోయి అతి కిరాతకంగా హత్యచేసి పట్టపగలు చంపేశారు. కారు టైరు పగిలి పోవడంతో కారును అక్కడే వదిలేసి నెంబర్‌ ప్లేట్‌ను తీసుకుని పారిపోయారు. మృతురాలి ఆడబిడ్డ దివ్య నిందితుల వివరాలు వెల్లడించినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటనతో సాక్షాత్తు ముఖ్యమంత్రి  రంగంలోకి బేరసారాలు సాగించి బెదిరించి ప్రాణానికి ఖరీదు కట్టాడు. పట్టపగలు జరిగిన ఇంత దారుణమైన సంఘటనకు కూడా బాబు హృదయం ద్రవించలేదు. ఒక బిజినెస్‌ మ్యాన్‌గా ప్రాణాలు కూడా ఖరీదు కట్టి చేతులు దులుపుకున్నారు. అప్పటిదాకా మీడియాలో వచ్చిన కథనాలను ఒక్కసారిగా కనిపించకుండా చేసేశారు. 

వేధింపుల్లో నాయకులు అనుచరులు, కుమారులు

తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు.. వారి పిల్లల దెబ్బకి రాష్ట్రంలో మహిళలు నోరెత్తడానికే భయపడుతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటే ఏ టీడీపీ కుక్క కరిచేస్తుందోనని భయపడి చస్తున్నారు. చిత్తకార్తె కుక్కల్లా పిచ్చి పట్టినట్టు ముందూ వెనకా చూసుకోకుండా మొరుగుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ వణికిపోతున్నారు.  మదమెక్కిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు. 
‘కామా తురాణాం నసిగ్గు నలజ్జ’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 
మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు మద్యం మత్తులో ఓ వివాహితను కారులోకి లాగేందుకు ప్రయత్నించి తన్నులు తిన్నాడు. ఇటీవల విశాఖలో జరిగిన జనచైతన్య యాత్రల్లో ప్రజా సమస్యలపై నిలదీసిందన్న కోపంతో టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు  వరలక్ష్మి అనే మహిళపై మైకు విసిరేసి దౌర్జన్యం చూపించాడు. చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో, హిందూపూర్‌ టీడీపీ ఎమెల్యే బాలకృష్ణ  సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళలను అగౌరవ పరుస్తూ మాట్లాడినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

ఇప్పుడు తాజాగా ...
మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చెయ్యడం బాబుకు ఆది నుంచీ అలవాటే అన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు విశాఖలో బికినీ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టాడు. మహిళల శరీరాలతో వ్యాపారం చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. దగ్గరుండి టెంట్‌లు వేసి విశృంఖలానికి విశాఖను సిద్ధం చేస్తున్నాడు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ విదేశీ వనితలతో  స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ అర్ధనగ్నంగా కనిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి  రాష్ట్రమంతా పెద్ద సంచలనమే అయ్యింది. పైగా దీనిపై ఆయన వివరణ ఇచ్చుకుంటూ మీడియాలో  ప్రచురించింది మూడు ఫొటోలే ఇలాంటివి నా వద్ద ఐదారొందులు ఉన్నాయని గొప్పలు పోవడం విడ్డూరం. 

ఎంపీ కూతురికీ రక్షణ లేదు... 
అనంతపురంలోని కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు నల్లా కనెక్షన్‌ విషయంలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా చితకబాదారు. తాజాగా అదే అనంతపురం జిల్లాలో పయ్యావుల అనుచరులు సమస్యపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళను దారుణంగా కాళ్లతో తన్ని పశుత్వం ప్రదర్శించారు. ఇది జరిగి  రెండు రోజులైనా గడవకముందే చిత్తూరు జిల్లాలో మాధవీలత అనే డాక్టర్‌ను పార్కింగ్‌ విషయమై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు బెదిరించారు. అయితే ఈమె టీడీపీకే చెందిన స్థానిక చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కూతురు కావడం మరో ముఖ్య విషయం. దాదాపు నాలుగు గంటలపాటు ఆమె రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసినా పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం జరగలేదు. 

సెక్స్‌ రాకెట్‌లో తెలుగు తమ్ముళ్లు..

విజయవాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్‌ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకని వడ్డీలకు డబ్బులిచ్చి తిరిగి తీసుకునేటప్పుడు మాత్రం చక్రవడ్డీలు వేసి కట్టకపోతే సమయం సందర్భం లేకుండా ఇళ్లల్లోకి చొరబడి వారి మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారని కేసులు కూడా నమోదయ్యాయి. అయినా నిందితుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. ఎందుకంటే ఆ కేసుల్లో ఇరుక్కుంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావడమే. బోడె ప్రసాద్, బోండా ఉమలపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. 

మహిళలపై హత్యాయత్నం కేసులు

పశ్చిమగోదావరి జిల్లా తుంద్రురులో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన సత్యవతి అనే మహిళపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు బనాయించి దాదాపు ఇరవై రోజులకు పైగా జైలుకు పంపించి మహిళలపై ఉన్న గౌరవాన్ని చంద్రబాబు బాగానే బయట పెట్టుకున్నారు. ఆమెతోపాటు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది మహిళలను కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పుతూ మనశ్శాంతి లేకుండా చేసి పచ్చ మదం ప్రదర్శించారు. 

అత్యాచారం కేసుల్లో ఇద్దరు టీడీపీ మంత్రులు 

మహిళలపై అత్యాచారం చేసిన మంత్రులు దేశవ్యాప్తంగా నలుగురు ఇప్పటికీ మంత్రులుగా కొనసాగుతున్నారని ఢిల్లీకి చెందిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. వారిలో ఇద్దరు మన రాష్ట్రానికి మంత్రులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయినా చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా క్యాబినెట్‌లో కొనసాగిస్తున్నారు. పైగా వారిద్దరికీ కీలక మంత్రి పదవులిచ్చి సత్కరించాడు. వారిద్దరూ ఎవరో కాదు.. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ. 

మహిళా గర్జనలో చంద్రబాబు ఏమన్నాడు
అది మార్చి 27, 2014. విజయవాడలో జరిగిన మహిళా గర్జన సభ. చంద్రబాబు ఎన్నికల ప్రచార  సభ. గెలవాలంటే మహిళల ఓట్లు ఎంత ముఖ్యమో చంద్రబాబుకు తెలియంది కాదు. ఇంకేముంది ఆడంబరంగా హామీలు గుప్పించేశాడు. ఆయన ఏం చెప్పాడంటే..
ఈ ఏడాదిని మహిళ నామ సంవత్సరంగా మారుస్తా. కుటుంబాలను బలి తీసుకుంటున్న బెల్ట్‌ షాపులను రద్దు చేస్తా. ప్రతి మహిళకు సెల్‌ఫోన్‌ ఇప్పిస్తా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. మహిళల రక్షణకు టోల్‌ ప్రీ నంబర్‌. ఫోన్‌ చేసిన ఐదు నిమిషాల్లో పోలీసులు అందుబాటులో ఉండేలా రక్షణ. స్వయంగా సీఎం ఫోన్‌కే కాల్‌ చేసి ఫిర్యాదు చేసే సౌకర్యం. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుట్టగానే ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 25వేలు జమ చేస్తా. మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !
 నిజానికి ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్క హామీ అమలు జరగకపోగా ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు మారిపోవడం శోచనీయం. 
Back to Top