నడుస్తున్నాడు...కొత్తచరిత్ర రాస్తున్నాడువిజయనగరం జిల్లా దేవపాత్రుని పాలెం ఒక చారిత్రకసంఘటనకు మైలురాయి అయింది. పదకొండునెలలుగా అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్ర..3వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భం అక్కడే ఆవిష్కారమైంది. గుర్తుగా... విజయస్థూపంలా పైలాన్‌ సగర్వంగా నిలిచింది. వైయస్సార్‌ కడపజిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర....విజయనగరం చెంత మూడువేల కిలోమీటర్లకు చేరుకోవడంలో అక్కడ పండగ సంబరమే నెలకొంది. యుద్దతంత్రాలకే కాదు, కళలకు కాణాచిగా, చదువుల నెలవుగా పేరెన్నికగన్న విజయనగరంలో సాగే పాదయాత్ర ఖచ్చితంగా...వై.యస్‌.జగన్‌ లిఖిస్తున్న కొత్తచరిత్రలో విశేష అధ్యాయమై తీరుతుంది. మూడు వేల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర...ప్రజాసమస్యల్ని పట్టి చూపింది. ఊరూరా సమస్యలను కళ్లకు కట్టింది.నాలుగున్నరేళ్ల పాలన కావొస్తున్నా...ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. పాలకుల బాధ్యతా రాహిత్యాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించింది. భూబకాసురులై...పేదల భూముల్ని సైతం దోచేస్తున్నవైనాల్ని...అభినవదుశ్శాసనులై సామాన్యుల్ని అవమానిస్తున్న దుర్మార్గాల్ని.. రైతుల కన్నీటికి కారణమైన పాలకుల కఠినత్వాన్ని...పేదవిద్యార్థుల గోడును...అటకెక్కిన ఆరోగ్యశ్రీతో అల్లాడుతున్న పేదజనం మొరల్ని...అన్నింటినీ...అసెంబ్లీలో నిలదీసినట్టుగానే...ప్రజాక్షేత్రం నుండి పాలకుల్ని నిలదీస్తున్నాడు వైయస్‌జగన్‌.ప్రజలకు ఆయనో భరోసా అవుతున్నాడు. ధైర్యం అవుతున్నాడు. వారిలో రేపటి వెలుగులపై నమ్మకాన్ని పెంచుతున్నాడు. భూమిపై దోచుకున్న వాటితో..గాల్లో తేలిపోతున్న అధికారపార్టీ నేతలను నేలకు దించుతున్నాడు. అవును అతను నడుస్తున్నాడు. నడుస్తున్న చరిత్ర అవుతున్నాడు. 
Back to Top