ముస్లిం యువకులపై టీడీపీ అరాచకత్వం

- బాబు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చిత్రహింసలు
క‌ర్నూలు: టీడీపీ పాలనలో అరాచకత్వం కొనసాగుతోంది. మంగళవారం గుంటూరులో జరిగిన నారా హమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు 8 మంది యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారిగా భావిస్తున్న ముస్లిం యువకులు 24 గంటలుగా పోలీసులు ఆయా స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.. టీడీపీ ముస్లిం నాయకత్వానికి చోటు ఎక్కడని,  వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ ఏమైందని, ఉర్దూ మీడియం విద్యార్థులకు బస్సు సౌకర్యం, స్కాలర్‌షిప్పులు ఎక్కడని ప్రశ్నిస్తూ ముస్లిం యువకులు చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి అని ప్లకార్డులు ప్రదర్శించారు. వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముస్లిం యువకుల చొక్కాలు విప్పదీసి నల్లపాడు పీఎస్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత‌ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
Back to Top