మోసానికి మరో ముందడుగు


– స్పష్టతలేని ప్రకటలతో ఏమారుస్తున్న చంద్రబాబు
– మంత్రుల రాజీనామా అంటూనే ఎన్‌డీఏలో కొనసాగుతామని డబుల్‌ గేమ్‌
– ప్రత్యేక హోదాపై ఇప్పటికీ స్పష్టత కరువు 
– నెపాన్ని బీజేపీ మీదకు నెట్టేసి తప్పించుకునే కుట్ర
– వెఎస్సార్‌సీపీకి క్రెడిట్‌ దక్కుతుందనే దోబూచులాట 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14 ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని అరుణ్‌జైట్లీ చెప్పడం తెలుగు ప్రజలను మోసగించడమే. గతంలోనూ ఇదే విషయం ప్రస్తావించినప్పుడు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం వ్యవఅవాస్తవాలను ప్రచారం చేసి ఏపీ ప్రజలను అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రతిపాదించిన ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు అంగీకరించడంపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళనలు నిర్వహించింది. 

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదంటున్న టీడీపీ, బీజేపీ ప్రచారాన్ని తిప్పిగొడుతూ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఆధారాలతో సహా ఆయన పలు కీలక విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీలోనూ దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. సాంకేతికంగా జరిగిన దానికీ.. బీజేపీ చేస్తున్న ప్రచారానికి తేడాలున్నాయని ప్రశ్నించారు. 
ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రస్తావించిన అంశాలు.. 
– బీజేపీ చెప్పేదాని ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. 14 ఆర్థిక సంఘం అమల్లోకి రావడం వలన ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. 
– 14వ ఆర్థిక సంఘం వైవీ రెడ్డి నేతృత్వంలో ప్రతిపాదించింది 2013లోనే అయినా.. అమల్లోకి  వచ్చింది మాత్రం 2015లో. 
– ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కేబినెట్‌లో తీర్మాణం చేసింది మార్చి 2, 2014లో. 
– డిసెంబర్‌ 31, 2014తో ఆర్థిక సంఘాన్ని రద్దు చేసి నీతిఅయోగ్‌ని తీసుకొచ్చారు. 
– అంటే ప్రత్యేక హోదా ప్రతిపాదనకు.. నీతి అయోగ్‌కు అమల్లోకి(జనవరి 1, 2015) రావడానికి మధ్య తొమ్మిది నెలల సమయం ఉంది. 
– ఈలోపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేసి ఉండాలి. 
– మోదీ పీఎం అయిన తర్వాత ఏడు నెలలపాటు ప్లానింగ్‌ కమిషన్‌ అమల్లోనే ఉంది.  – ఏడు నెలలపాటు ఫైల్‌ కదలకుండా పడి ఉంటే చంద్రబాబు పట్టించుకోలేదు. 
– 14 ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడు అభిజిత్‌ సేన్‌ చెప్పింది వాస్తవం కాదా. 
– దేశంలోనే సీనియర్‌ ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియనివి కావు.
కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ... !
ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు తన స్వలాభం కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. నాలుగేళ్లుగా మాట్లాడని వ్యక్తి.. ప్రత్యేక హోదా డిమాండ్‌ ప్రజల్లోకి వెళ్లడం చూసి భయాందోళనకు గురయ్యారు. నెపం బీజేపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలని వ్యూహాత్మకంగా పథక రచన చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా బీజేపీ నుంచి బయటకొచ్చేయాలని చూస్తున్న చంద్రబాబు.. ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్‌తో చర్చలు కూడా జరిపారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 13న సోనియా ఇవ్వబోతున్న విందులో టీడీపీ నాయకులు పాల్గొంటారని ప్రతికల్లోనూ పతాక శీర్షికల్లో కథనాలు వెలువెడ్డాయి. అశాస్తీ్రయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు.. ప్రజలు వారికి తగిన శాస్తి చేశారని కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటూనే వారితో దోస్తీకి చంద్రబాబు ఉబలాడపడుతున్నారు. అధికారం కోసం ప్రజలను మోసం చేయడానికి వెనకాడని చంద్రబాబు నైజానికి ప్రత్యక్ష ఉదాహరణ. 
చంద్రబాబు నిర్ణయంలో స్పష్టతేదీ..?
ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగేది లేదని చంద్రబాబు ప్రకటించి పతాక శీర్షికల్లో నిలిచారు. అలా అంటూనే ఎన్‌డీఏలోనే కొనసాగుతామని చెప్పి రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి బయట పెట్టారు. అంత ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్టు.. మాటల్లో ప్రదర్శించే దూకుడు చేతల్లో ఉండదు. కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు ప్రకటించి.. ఎన్‌డీఏలోనే కొనసాగుతామని చెప్పడంపై  ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

– ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ నాయకులు ప్లకార్డుల ప్రదర్శన చేశారు. అంటే అది ఎలాంటి న్యాయం. 
– ప్రత్యేక హోదాపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలి. 
– ఆనాడు ప్యాకేజీ బాగుందని అంగీకరించారు. అరుణ్‌జైట్లీకి శాలువాలు కప్పి, తిరుపతి లడ్డూలు పంచారు. హోదా అంటే విద్యార్థులను జైల్లో పెడతామన్నారు. ప్యాకేజీతో మీరేం సాధించారు. 
– గత నాలుగు బడ్జెట్‌లలో ఏపీకి అన్యాయం చేస్తున్నారని కేంద్రం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో అన్ని రాష్ట్రాల కన్నా మనకే ఎక్కువ ఇచ్చారని మీరు చెప్పింది మర్చిపోయారా. 
– కేంద్ర మంత్రులు వైదొలిగినంత మాత్రాన రాష్ట్రానికి లాభం ఉంటుందా. 
నష్టం జరిగిందని చెబుతున్నప్పుడు.. కేంద్రం మీద అవిశ్వాసం పెట్టడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి..?
– కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన చంద్రబాబు.. ఎన్‌డీఏలో కొనసాగుతానని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి..?
– రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి అనుకున్నప్పుడు.. మీరే స్వయంగా ప్రధానిని కలవొచ్చుగా. మీ తరఫున నాయకులను పంపడం సమంజసమేనా..? ఇంత నష్టం జరిగాక కూడా భేషజాలకు పోయి ఏం సాధించాలని మీ తాపత్రయం. 
– రాష్ట్ర అవసరాల కన్నా మీ స్వప్రయోజనాలే మీకు ముఖ్యమా.
– తెలుగు వారి ఆత్మగౌరవం అంటే.. ఢిల్లీకెళ్లి పొగిడి రావడమేనా 
Back to Top