అపర చాణిక్యుడు అభాసుపాలు..

 మోసం అనే పదానికి
పర్యాయపదంగా, నక్క జిత్తుల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన చంద్రబాబుతో దోస్తానా అంటూ
చేతులిచ్చిన పాపానికి కాంగ్రెస్‌ పార్టీ  చివరకు అదే చేతులతో
చెక్క భజన చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబుతో కలిసి తమ చెప్పుతో తమ
కొట్టుకున్నామని లబోదిబో అనటం తప్ప చేసేదేమీ లేక తేలు కుట్టిన దొంగల్లా కాంగ్రెస్‌
నేతలు  మిన్నుకున్నారు. పచ్చబాబు పచ్చనోట్ల రాజకీయాలు, శకుని లగడపాటి
స్టాటజీలు,పచ్చమీడియా పబ్లిసిటీ ఎత్తులు తెలంగాణ ఎన్నికల్లో పని చేయలేదు.

 ఏపీని గ్రాఫిక్స్‌లో
చూపించడం తప్ప నీకేం చేతకాదని అపర చాణిక్యుడి మేతావుతనాన్ని తెలుగు ప్రజలు ఇట్టే
పసిగట్టేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతా..అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరుకూ
తిరిగే పచ్చ బాబును  ఏపీలో కూడా చ్రరితలో కలిపేయడం మాకు  చాలా చారిత్రాత్మక
అవసరం అంటుంది ఆంధ్ర రాష్ట్రం.. 
అటు తెలంగాణలోనూ సైకిల్‌ తుక్కుతుక్కు
అయిపోవడం, ఇటు ఏపీలోనూ ప్రజల నుంచి ఛీతార్కాలు ఎదుర్కొవడంతో  చంద్రబాబు అనే అపర మేధావి బిత్తరచూపులకే పరిమితమయ్యాడు. 

  తెలంగాణలో పాగా
వేయబోయి..పరాభావం చెందిన చంద్రబాబు అనే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆత్మరక్షణ, ఆస్తుల రక్షణలో
పడ్డారు.బొంకు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రాస్‌గా కిర్తీ గడించి,  వెన్నుపోటుకు వన్నెతెచ్చిన  చంద్రబాబుకు  2019 ఎన్నికల్లో ఖచ్చితంగా లెక్క అప్పగించే పనిలో ఆంధ్రరాష్ట్రం ప్రజలు
ఉన్నారు. తెలంగాణలో ఎలాగు దుకాణం సర్దేసిన పచ్చదేశాన్ని వచ్చే ఎన్నికల్లో  ఏపీలో కూడా దుకాణాన్ని మూయించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. మీడియాతో
సహా అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్టగా పేరుమోసిన  బాబుగారు సామాజిక మాధ్యమాలను మాత్రం మేనేజ్‌ చేయడంలో మాత్రం
విఫలమయ్యారు. చంద్రబాబు తన పచ్చబృందంతో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నా వర్క్‌వుట్‌
కావడం లేదు. ఎల్లకాలం తెలుగు ప్రజలు ఏది చెప్పితే అది నమ్ముతారు.. పూటకో మాట, రోజుకో అబద్ధం
వల్లేవేస్తూ ఊసరవెల్లిలా రంగుమార్చే చంద్రబాబు రంగును వదిలించడానికి ఏపీ ప్రజలు
రెడీ అంటున్నారు..

Back to Top