- భూ కేటాయింపుల కమిటీలో లోకేష్‌కు స్థానం
- గంటాను తొలగించి మరీ కట్టబెట్టిన సీఎం బాబు
- కమిటీలో సీనియర్ మంత్రి కేఈ కృష్ణమూర్తికి దక్కని స్థానం
-లోకేష్ కనుసన్నల్లో విచ్చలవిడిగా భూ దోపిడీ
తన కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇప్పటికే అసమర్థుడిగా ముద్రపడి అందరిచేత పప్పుగా పిలవబడే తనయుడి జీవితాన్ని ఎలాగైనా తీర్చిదిద్దడానికి నానాపాట్లు పడుతున్నాడు. పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల్లో లోకేష్ బాబు చేతగానితనంపై తీవ్రంగా చర్చలు నడుస్తున్న తరుణంలో చంద్రబాబు తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రజా సంక్షేమం గాలికొదిలి కొడుకు సంక్షేమమే ముఖ్యమన్నట్టు బాబు పడుతున్న తాపత్రయం అంతా ఇంతాకాదు. కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పార్టీలో సీనియర్లను కూడా పక్కన పెడుతున్న బాబు వ్యవహారంపై ఇప్పుడు టీడీపీలోని కీలక నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.
భూకేటాయింపులు కమిటీలో లోకేష్
తాజాగా నారా లోకేష్‌ను చంద్రబాబు రాజధాని భూముల కేటాయింపుల కమిటీలో సభ్యుడిగా చేర్చాడు. ఇందుకోసం కమిటీలో సభ్యుడిగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానానికే ఎసరు పెట్టాడు. అయితే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తిని కూడా కాదని లోకేష్‌కు స్థానం కల్పించడంపై అగ్గి రాజుకుంది. నిజానికి కేఈ కృష్ణమూర్తి రాజకీయాల్లో చంద్రబాబు కన్నా సీనియర్ నాయకుడు. పాపం ఈ మధ్య కాలంలో ఆయన భవితవ్యం కూడా ఏమంత బాగున్నట్టు లేదు. ఇప్పటికే ఆయన కేటాయించిన శాఖలో ఆయనకే అధికారం లేకుండా చేసిన చంద్రబాబు ఇప్పడు తాజాగా భూ కేటాయింపుల కమిటీలో లోకేష్‌ను చేర్చి ప్రత్యక్షంగానే భూముల దందాకు తెరతీశాడు. ఇన్నాళ్లు తెరవెనుక రాజకీయం చేసిన లోకేష్ ఇప్పడు అధికారికంగానే దందాలకు దిగుతున్నాడన్నమాట. మంత్రిగా కాకముందు అన్ని భూముల కేటాయింపుల్లోనూ లోకేష్ హస్తం ఉందన్న అనుమానాలకు ఇప్పడు బాబు తాజా నిర్ణయంతో బలం చేకూరినట్లు స్పష్టమవుతుంది. పైగా ఈ కమిటీలో అందరూ లోకేష్ అనుచర గణాన్ని నియమించి ప్రోత్సహించడం మరీ దారుణం. ఎలాంటి సత్తా లేని వ్యక్తిని ఇప్పటికే ఎమ్మెల్సీని చేసి దొడ్డి దారిన మంత్రిని చేసిన బాబు.. లోకేష్‌ను రాజధాని భూ కేటాయింపుల కమిటీలో చేర్చడం నిజంగా జనాల నెత్తిన మరో పిడుగు వేయడం వంటిదే.. తాజాగా లోకేష్ అవినీతిపై నిన్నటికి నిన్న మాజీ మంత్రి కీలక ఆరోపణలు కూడా చేశారు. విజయవాడలోని గుణదలలోని 4.8 ఎకరాల ట్రాన్స్‌కో భూమిని లోకేష్ తనకు సన్నిహితులైనవారికి కట్టబెట్టేందుకు సిద్దపడ్డారని కూడా చెప్పారు. ఇలాంటివి ఇప్పటికే రాష్ర్టంలోని 13 జిల్లాల్లో ఎన్నో వెలుగు చూశాయి. అయినా చంద్రబాబు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం చూస్తుంటే కుంభకోణాలన్నీ బాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేది సుస్పష్టం