విలువలకు అద్దంపట్టే నాయకుడు వైఎస్ జగన్


విలువ అంటే ఓ మనిషికి ఇచ్చేది. ఆ మనిషి మంచితనాన్ని గుర్తించి ఇచ్చేది. ఆ మనిషి చరిత్రను మెచ్చుకుంటూ ఇచ్చేది. విలువలను పాటించే మనిషే మరో మనిషికి విలువ ఇవ్వగలడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాంటి విలువలున్న మనిషి. అందుకే ఆయన జీవితంలో తోటి మనిషికే విలువ ఇచ్చారు. పేదవాడైనా, పక్కపార్టీవాడైనా ఆయనకు సమానమే. కులం, మతం, జాతి, జెండా, పార్టీ ఇవేవీ ఆయన లెక్కచేయలేదు. మనిషిలోని మంచితనమే కొలమానం ఆయనకు. మరి ఆ మహానేతకు వారసుడే కదా వైఎస్ జగన్. అక్షరాలా ఆ తండ్రి బుద్ధులు పుణికి పుచ్చుకున్నవాడు. ఆయన ఆశయాలను తన బాటగా మార్చుకున్నవాడు. ఆయన బాటను తన శ్వాసగా చేసుకున్నవాడు. మరి ఆయన ఆలోచనలు, నడవడిలో మాత్రం ఆ తండ్రికి సరితూగకుండా ఉంటాడా? విలువలు విశ్వసనీయత అంటూ వైఎస్ జగన్ ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. మాట్లాడటమే కాదు దాన్ని ఆచరణలోనూ చేసి చూపుతాడనటానికి నిదర్శనం కృష్ణాజిల్లా ప్రజా సంకల్ప యాత్రలో నిమ్మకూరులో ఆయన చేసిన ప్రకటన. అధికారంలోకి వచ్చిన వెంటనేకృష్ణాజిల్లాను నందమూరి తారమకరామారావు జిల్లాగా మారుస్తానంటూ యువనేత చేసిన ప్రకటనకు నిమ్మకూరు ప్రజానీకమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యానందాలతో పులకించింది. 

చలించిపోయిన యువనేత

యువనేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కృష్ణాజిల్లాలో సాగుతోంది. నిమ్మకూరుకు చేరుకుంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి పురిటిగడ్డ అది. తెలుగు వారి గుండెల్లో అన్నగారిగా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావు గారి జన్మస్థలం అది. తెలుగు జాతి ఖ్యాతి కీర్తిపతాకాన్ని జాతీయ రాజకీయ వేదికపై రెపరెపలాడించిన ఓ ఆంధ్రుడి ఆనవాలు అది. ఆ ప్రాంతాన అడుగుపెట్టిన క్షణంలోనే ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆ మహామనిషి గొప్పతనాన్ని స్మరించుకున్నారు వైఎస్ జగన్. పాదయాత్రలో భాగంగానిమ్మకూరు నడిబొడ్డున నడుస్తున్న యువనేతకుఆ పల్లె ప్రజల గుండె చప్పుడు తెలిసింది. ఆ వూరి ప్రజల మనోవేదన వారి మాటల్లో ప్రతిఫలించింది. ఏ పార్టీనైతే ఎన్టీఆర్ స్థాపించి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడో ఆ పార్టీయే నేడు ఆయన పేరును, ఫొటోనూ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేసారు నిమ్మకూరు వాసులు. చివరికి ఎన్టీఆర్ బంధువులు సైతం టిడిపి హాయంలో తమ ఊరు అభివృద్ధికి నోచుకోలేదంటూ వాపోవడం వైఎస్ జగన్ ను కలిచివేసింది. అందుకే అప్పటికప్పుడే ఆయన అధికారంలోకి వచ్చిన తక్షణమేనిమ్మకూరును అభివృద్ధి చేయడమే కాదు, జిల్లాకే ఎన్టీఆర్ పేరును పెడతానని మాటిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతిపక్షనేత తీసుకున్నఈ నిర్ణయం సంచలనమైంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ ఇంలాంటి సంఘటన ఎన్నడూ జరిగింది లేదు.నిమ్మకూరులో అడుగు పెట్టినప్పుడుగొప్ప ప్రజా నాయకుడైన ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నాడు వైఎస్ జగన్.

ఆ మహనీయుడు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. రాజకీయాల్లో ఓ చరిత్ర రాసుకున్నాడు. ఆయన్ను వెన్నుపోటు పొడిచిన చీకటి మనుషులే నేడు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారు. అన్యాయాలు, అక్రమాలు, అనైతికతకు రాష్ట్రాన్ని అడ్డాగా చేసేసారు. ఆయన స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయన పేరూ, రూపు లేకుండా చేయాలని కుట్రలు పన్నారు. ప్రజల మనసుల్లోంచి ఆ పేరును మాయం చేయాలని చూసారు. కానీ మనిషికి, ఆ మనిషి గొప్పతనానికి ఉన్న విలువలను గుర్తించిన నాయకుడు కనుకే వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ప్రస్తావించారు. 

విలువలు విశ్వసనీయతకు ఇది ఓ ఉదాహరణ

ప్రత్యర్థి పార్టీకి చెందిన గొప్ప నాయకుడిని గౌరవించడం వైఎస్ జగన్ విలువల రాజకీయాలకు ఓ ఉదాహరణ. పదవినిచ్చి, హోదా నిచ్చిన నాయకుడికే వెన్నుపోటు పొడిచి, పార్టీని హస్తగతం చేసుకుని చివరకు ఆయన ఫొటోను, పేరును నామరూపాలు లేకుండా చేయడం చంద్రబాబు కృతఘ్నతకు నిదర్శన. ఎన్టీఆర్ ను, ఆయన కుటుంబాన్ని, ఆయన కీర్తి ప్రతిష్టలను, చివరికి ఆయన అభిమానులను సైతం అవసరానికి వాడుకుని ఆ తర్వాత వీధిన పడేసాడు చంద్రబాబు. మాట తప్పని తత్వం, మడమ తిప్పని వారసత్వం వైఎస్ జగన్ ది. కుళ్లు, కుతంత్రాల అనుభవం చంద్రబాబుది. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడమే అసలు సిసలైన నాయకత్వం అంటాడు ఈ యువ జన హృదయాధినేత. ప్రజలను ఎలాగైనా వంచించి మరో సారి చక్రం తిప్పాలనుకుంటాడు ఆ కుతంత్రాల అధినేత. నీతికి అవినీతికి, నిజాయితీకి స్వార్థానికి, మంచికి చెడుకు మధ్య సాగే ఈ పోరులో ప్రజలు ఎవరి వెన్నంటి ఉన్నారో నిమ్మకూరు వాసుల మనోభావాలు మరోసారి చాటిచెప్పాయి. 
వైఎస్ జగన్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం టిడిపికి మింగుడు పడని వ్యవహారం. పచ్చకండువాలకు కోలుకోలేని దెబ్బ. ఎన్టీఆర్ వారసత్వం అనిచెప్పుకుంటూ ఆ నాయకుడికి ఆ పార్టీ ప్రస్తుత అధినేత చేసిన అన్యాయం, ఆ సమయంలో ఎన్టీఆర్ పడ్డ ఆక్రోశం అన్నీ ప్రజల కళ్లముందుకు మరోసారి రావడం వారికి నింగా మింగుడు పడని వ్యవహారం. చెరిపేయాలనుకున్న గుర్తులకు వైఎస్ జగన్ మళ్లీ జీవం పోసినందుకు టిడిపి నేతల కళ్లు పచ్చబడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Back to Top