ప్రజల మనసు దోచిన జననేత


ప్రజాసంకల్పయాత్ర16 రోజులుపూర్తిచేసుకుంది. శుక్రవారం నాటికి  మొత్తం 225.6 కి.మీదూరంయాత్రసాగింది. వైయస్ ఆర్ కడప జిల్లాలోపులివెందుల నియోజకవర్గం నుంచి మొదలైన ప్రజాసంకల్ప పాదయాత్ర కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్ ను దాటుకుంటూ అప్రతిహతంగా సాగుతోంది.
ఏనియోజకవర్గంలో అడుగుపెట్టినా అంతులేని జనప్రవాహం సంకల్పానికి ఎదురొచ్చి స్వాగతం పలుకుతోంది. తమ కష్టాలు తీర్చే నాయకుడొస్తున్నాడంటే ప్రజల్లో కలిగే ఆనందోత్సాహాలకు పాదయాత్రలోని ప్రతిక్షణం ఓ ప్రతిరూపంగా నిలుస్తోంది. పల్లెలన్నీ జననేత తో కలిసి నడుస్తున్నాయి.  

ఊరికీఊరికీ మధ్య బాటలో కూడా ప్రతిపక్షనేతను కలిసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు.  వయసును లెక్కచేయకుండా అవ్వాతాతలు  వైకల్యాలను వెనక్కి నెట్టి  దివ్యాంగులు వైయస్ జగన్ అన్న వస్తున్నాడనం
ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. ప్రజాభిమానం అంటే ఇది అని నిరూపిస్తున్నారు.

వైయస్ ఆర్ సీపీ అధినేత, ఎపి ప్రధానప్రతిపక్ష నేత  పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు, స్థానికనేతలు, వ్యాపారులు, ఉద్యోగులు ఎందరో పాలు పంచుకుంటున్నారు. తమ సమస్యలను  విన్నవించుకుంటున్నారు. బుడగ జంగాల నాయకులు, క్వారీ కార్మికులు, పొదుపు సంఘాల మహిళలు, తండాలవారు, విద్యార్థి, నిరుద్యోగ బృందాలు, ముస్లిములు, ఆశావర్కర్లు, 108 ఉద్యోగులు, మోడల్ స్కూల్ టీచర్లు, రైతులు, కూలీలు  జగనన్నను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. 

మీపై నమ్మకముందన్నా, మిమ్మల్నిగెలిపించుకుంటా మంటూ ఉద్వేగంగా చేతిలోచేయి వేసిప్రమాణం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఊరూరా ఎంతోమంది స్థానికనేతలు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారు.  వైయస్ ఆర్ కుటుంబంలో ప్రజలంతా ఉత్సాహంగా చేరితే, నేడు పాదయాత్రలో పలువురు ప్రముఖనేతలు పార్టీలో భాగస్వాములౌతున్నారు. తూర్పుగోదావరి  తాళ్లరేవు మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు, కర్నూలు కోవెలకుంట్లలోడాక్టర్ల సంఘంఅధ్యక్షుడు రామిరెడ్డి, స్థానికనేతలైనపేరా సోదరులు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్షనేత బహిరంగ సభలు, సదస్సులు, ముఖాముఖీలు జరుపుతున్నారు. ప్రతిపక్షనేత. వెల్దుర్తిలో, బేతెంచర్లలో బహిరంగసభలు, హుస్సేనాపురంలో మహిళా సదస్సు, పలుచోట్ల మహిళలతో ముఖాముఖీ జరిపారు. పల్లెల్లో రచ్చబండలు నిర్వహిస్తూ ప్రజాసమస్యలను తెలుసుకుంటున్నారు. వారికష్టాలను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. మహానేత వైయస్ఆర్  పాలనను తిరిగి తీసుకు వస్తానని వాగ్దానం చేస్తున్నారు. పింఛన్లను 2000 చేయడం, ఫీజు రీయంబర్సుమెంటుతో పాటు భోజనం, వసతి కోసంఅదనంగా 20 వేలు, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, 45 ఏళ్లకే ఫింఛన్, అంచెలంచలుగా మద్యం రద్దు, ఊరూరా గ్రామ సచివాలయం హామీలతో ప్రజల మనసును దోచుకుంటున్నారు  జననేత. 


Back to Top