హోదా ధర్నాకు ప్రాధాన్యత అంతేనా..?

– ఉద్యమకారుడి మరణం కంటే మసాలాకే ప్రాధాన్యం
– జగన్‌ విమర్శలనూ తిట్లుగా ప్రచారం చేసే కుట్ర
– ఉద్యమాన్ని నీరు కార్చడమే ఎల్లో మీడియా ధ్యేయం?

రోజంతా ధర్నా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. రోడ్లన్నీ బోసుపోయాయి. పార్టీ పిలుపుమేరకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీపై, ప్రత్యేక హోదా అడక్కుండా ప్యాకేజీ అంగీకరించిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రతి జిల్లాలోనూ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. నాయకులను, ఎమ్మెల్యేలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఉద్యమం ప్లాపైంది చెప్పడానికి పోలీసులను పంపించి బస్సులను నడిపేందుకు ప్రయత్నించారు. సాయంత్రానికి మీడియా ముందుకొచ్చిన టీడీపీ అధికార బృందం బంద్‌ విఫలమైందని చెప్పడానికి నానా యాతన పడ్డారు. ఒక పక్క బంద్‌ విఫలమైందని చెబుతూనే మరో పక్క బంద్‌ ప్రభావతంతో వంద కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని విభిన్నమైన వాదన తెచ్చారు. 

నాలుగేళ్లుగా చేసిన మోసాన్ని చివరి నిమిషంలోనూ కొనసాగించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూనే.. హోదా కోసం ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించలేదు. గతంలోనే హోదా కోసం అవిశ్వాసం పెడదామని చంద్రబాబును ఆహ్వానించాడు వైయస్‌ జగన్‌. కానీ ఆయన మాత్రం మొదట సరేనని వెంటనే యూటర్న్‌ తీసుకున్నాడు. ఎంపీలమంతా రాజీనామా చేద్దామని చెప్పినా ఇప్పటికీ ఆయనలో స్పందన లేదు. కానీ ఆయన మాత్రం పార్లమెంట్‌లో మేం అవిశ్వాసం పెడితే జగన్‌ కోర్టులో.. పవన్‌ ట్వీట్లలో అంటూ ట్వీట్‌ చేశాడు. కానీ అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో.. పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కాళ్లలో క్రరలు పెట్టి అడ్డుకుంటున్నారు. 
నిరసన కార్యక్రమం ముగిశాక వైయస్‌ జగన్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చివరి వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా కోసం అంత పెద్ద ఎత్తు ధర్నా జరిగిందీ.. ధర్నాలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కానీ అవేవీ కొన్ని పత్రికలకు గొప్పగా అనిపించలేదు. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పట్టుకుని రచ్చ చేస్తున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేశాడంటూ మసాలా జోడించడానికి ప్రయత్నించడం సిగ్గు చేటు. ఇదే పవన్‌ కల్యాన్‌ గతంలో వైయస్‌ఆర్‌ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తే వీరికి కనిపించలేదు. సోషల్‌ మీడియాలో వైయస్‌ జగన్‌ టార్గెట్‌గా రెచ్చిపోతే పట్టించుకోలేదు. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రేయ్‌ పోరా అంటూ అసభ్యకరంగా దూషించినా వీరి పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదు. ప్రజా ప్రయోజనాలను విస్మరించి రాజకీయ కోణంలో ఆలోచించి.. ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నించడం నిజంగా బాధాకరం. 
Back to Top