తెరుచుకొని ప్ర‌భుత్వ బ‌డులు

అర‌కు మండలంలో 31 పాఠశాలల మూసివేత

నేటికీ ఉపాధ్యాయులు నియమించని ప్ర‌భుత్వం

అరకులోయ:  కూట‌మి పాల‌న‌లో పేద‌ల‌కు విద్య అంద‌ని ద్రాక్ష‌గా మారింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త కార‌ణంగా అర‌కు మండలంలోని 31 ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఈ నెల 12న జిల్లాలోని విద్యాసంస్థలు పునఃప్రారంభంకాగా, మండలంలోని ప్రాథమిక పాఠశాలలకు మాత్రం మోక్షం కలగలేదు. ఉపాధ్యాయులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మండలంలోని ప్రాథమిక పాఠశాలలను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఒక్క లోతేరు పంచాయతీ పరిధిలోనే అత్యధికంగా 11 పాఠశాలలకు టీచర్ లేక మూతపడ్డాయి. లోతేరు పంచాయతీ పరిధి వంతలగుడ, తోడుబం ద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తది తర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. మిగతా పంచాయతీల్లోని ప్రాథమిక పాఠశాలల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉపాధ్యాయులు లేని కారణంగా మండలంలో 31 ప్రాథమిక పాఠశాలలు మూతపడడం వాస్తవమేన‌ని మండల విద్యాశాఖాధికారి త్రినాథ్ ఒప్పుకున్నారు. ఈ సమస్యను వారం రోజుల క్రితం ఐటీడీఏ పీవో, డీడీకి లిఖిత పూర్వకంగా వివరించానని ఎంఈవో  తెలిపారు.

Back to Top