ఈనాడుఇంత దిగజారిందా??


పత్రిక అనేదానికి ఉండాల్సిన విలువలను కాస్తఅంతైనా పాటించని స్థాయికి ఈనాడు దిగజారిపోయింది అంటున్నారు పాఠకులు. అదుకు రుజువు ఈనాడు ప్రచురిస్తున్న కథనాలే అంటున్నారు. ఎపి ముఖ్యమంత్రికి అనుకూలంగా మాత్రమే పనిచేసే మీడియా సంస్థ ఈనాడు అనే విషయం బహిరంగంగా అందరికీ తెలిసిందే. అయితే కనీసం ప్రజలకు సంబంధించిన వార్తల విషయంలోనూ, వాస్తవాలు కనిపిస్తున్న సంఘటనల్లో కూడా ఈనాడు తన పచ్చనితనాన్ని మాత్రమే ప్రకటించుకోవడం జుగుప్సా కరంగా ఉందంటున్నారు. 
22 మంది తెలుగు మత్స్యకారులు గుజరాత్ సముద్ర జలాల్లో వేటకు వెళ్లి, పాక్ కోస్టు గార్డుల చేతికి చిక్కిన ఘటనపై ఈనాడు ధృక్కోణం ఎంత పక్షపాతంగా ఉందో చూడొచ్చు. గుజరాత్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర రెక్కలు ముక్కలు అంటూ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. గుజరాత్ వ్యాపారులకు ఉత్తరాంధ్ర మత్స్యకారుల శ్రమ కాసులు కురిపిస్తోందని, మత్స్యకారులకు మాత్రం కన్నీటిని మిగిలిస్తోందని ఈ కథనం సారాంశం. అయితే ఇందులో గుజరాత్ తీరం నుంచి పాక్ చేతిలో బందీలైన మత్స్యకారుల గురించి ఒక్కమాటైనా రాయలేదు ఈనాడు. ఆ విషయాన్ని ఫోకస్ చేస్తే ముఖ్యమంత్రి ఈ సంఘటనపై స్పందించారా లేదా? వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టింది? వారిని విడిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అన్న విషయాలను కూడా ప్రస్తావించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మత్స్యకారుల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దాంతో ఈ విషయాన్ని మాత్రం దాటవేసి గుజరాత్ లో మత్స్యకారుల కష్టాలపై హృదయవిదారకమైన కథనాన్ని మాత్రం ప్రచురించింది ఈనాడు. ఇది ముమ్మాటికీ టిడిపీ ప్రభుత్వ వైఫల్యాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యాన్నీకప్పి పుచ్చే చర్యే అంటున్నారు పాఠకులు. 
ఇక సుజనా చౌదరి వ్యవహారంలోనూ ఈనాడుతోపాటు, ఆంధ్రజ్యోతి ఇతర టిడిపి ప్రో మీడియా చేస్తున్న ప్రచారం కూడా ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. టిడిపికి చెందిన నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను కక్షపూరితం అంటూ ప్రచారం చేయడాన్ని ప్రజలే నిరసిస్తున్నారు. ప్రత్యేకించి సుజనా చౌదరి వ్యవహారంలో కోర్టు సుజనాను ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే అని, విచారణ నిలుపు ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినదాన్ని కూడా మసి పూసి మారేడు కాయ చేసి, చంద్రబాబుకు, సుజనాకు అనుకూలంగా మార్చి రాయడాన్ని తప్పుపడుతున్నారు తెలుగు పాఠకులు. సుజనాపై నిర్బంధం కుదరదని కోర్టు తేల్చి చెప్పినట్టు పత్రికల్లో, ఛానెళ్లలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు లేకుండా వెంటనే అరెస్టు చేస్తారనే సుజనా చౌదరి భయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని, ఈడీ నుంచి సమాధానం కోరింది. సత్వర అరెస్టులు ఉండవు కనుక సదరు పిటీషనర్ పరువుకు కలిగే భంగం ఏమీ లేదని తెలియజేస్తూ, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రాధమిక ఆధారాలు ఉన్నందున, ఈడీ సమర్పించిన పత్రాల్లో సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు కీలకమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కనుక విచారణను ఆపే ప్రసక్తి లేదని ధర్మాసనం తీర్పు చెప్పింది. అంటే ఇది ముమ్మాటికీ సుజనా చౌదరికి ఎదురుదెబ్బ. కానీ ఈ విషయాన్ని మార్చి తిరగరాసి కోర్టులో సుజనా చౌదరికి అనుకూలమైన తీర్పు వచ్చినట్టు ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఆర్థిక నేరగాళ్లకు నిలయంగా ఉన్న టీడీపీని, ఆ పార్టీ నేతలను భుజాన మోస్తున్న పత్రికలపై పాఠకుల అసంతృప్తి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది. నిత్యం ఈ పత్రికల వార్తలపై జరుగుతున్న విశ్లేషణలు, వాఖ్యానాలు, విమర్శలే అందుకు నిదర్శనం. నిజాయితీగా నిజాలను ప్రజలముందు ఉంచాల్సిన మాధ్యమాలు కొన్ని అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజల కళ్లకు గంతలు కట్టాలనుకుంటే అది ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ రోజుల్లో సాధ్యం అయ్యే పని కాదని నినదిస్తున్నారు ఆధునిక పాఠకులు. ఈనాడు మాత్రమే కాదు ఇలా నిజాలను సమాధి చేస్తున్న ఈ పచ్చపత్రికనూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బహిరంగంగా చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు, తెలుగుదేశం ప్రభుత్వానికీ తొత్తుల్లా పనిచేస్తూ పాత్రికేయాన్ని దిగజారుడుతనంగా మార్చొద్దని హెచ్చరిస్తున్నారు. 
 
Back to Top