విదేశీయుల గుప్పిట్లోకి ఆంధ్రప్రదేశ్..?

కేంద్రనిధులను గాలికొదిలి..వరల్డ్ బ్యాంక్ వైపు చూపు..!
కళ్లు తెరవని చంద్రబాబు..!

హైదరాబాద్: గత అనుభవాలు గుణపాఠం నేర్పినా చంద్రబాబు బుద్ధి మారలేదన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు మాటలు, చేతలు చూస్తుంటే మళ్లీ  మళ్లీ  విషకౌగిలినే ఆశ్రయిస్తున్నారన్న సందేహాం కలుగుతోంది.  జపాన్, సింగపూర్ లతో రహస్య ఒప్పందాలు చూస్తుంటే ..ఈ సంగతి తెలుస్తోంది.   తెలిసి తెలిసి మళ్లీ అదే తప్పు చేస్తూ రాష్ట్రపాలన వ్యవహారాలను విదేశీయుల గుప్పిట్లోకి తీసుకెళ్లడం క్షమించరాని నేరం. 

మళ్లీ అదే తప్పు...!
చట్టపరంగా, న్యాయబద్ధంగా కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేయకుండా..విషపు కౌగిలిలో బంధీ కావడం తెలుగు ప్రజలను మోసం చేయడమే.  ప్రపంచ బ్యాంక్ రుణం కోసం షరతులను ముందస్తుగానే అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విదేశీయుల కబంధహస్తాల్లోకి రాష్ట్రాన్ని దోచిపెట్టే విధానానికి స్వస్తి చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  

సామాన్యులను దోచి సంపన్నులకు..!
విదేశీ సంస్థల ఆదేశాలతోనే గతంలో ఏపీ విద్యుత్ బోర్డును మూడు ముక్కలు చేసి ప్రైవేటీకరణకు పూనుకున్నారు చంద్రబాబు. వైద్య, విద్యరంగాల్లో యూజర్ ఛార్జీలు విధించారు. ఇలా అనేక విషయాల్లోప్రభుత్వం ఆర్థిక,సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. తాజాగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మళ్లీ పాత చంద్రబాబు గుర్తుకు వస్తున్నారు. సర్కారీ కొలువులకు కత్తెర, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం. భూదోపిడీ, ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఇలా చంద్రబాబు చేస్తున్న అవినీతి అంతా సామాన్యులను దోచి సంపన్నులకు పెట్టేందుకేనని అర్థమవుతోంది. చంద్రబాబు అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిపోతుంది.  
Back to Top