ప్రత్యేక హోదా ను ముంచింది చంద్రబాబే..!

() హోదా సంజీవని కాదంటూ కామెంట్లు

() గొప్పల కోసం గణాంకాలు మార్చిన వైనం

() చంద్రబాబు నిర్వాకంతో మనస్సు మార్చుకొన్న కేంద్రం

() హోదా లేదంటూ తేల్చేసిన కేంద్రం

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం తెలుగు ప్రజల కొంప ముంచింది.
ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశానికి తలుపులు మూశారు.  ప్ర‌త్యేక హోదా నిబంధ‌నేదీ ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ
చ‌ట్టంలో లేద‌ని ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి జ‌యంత్‌సిన్హా పేర్కొన్నారు.  దీని మీద విమర్శలు తలెత్తటంతో కేంద్ర ఆర్థిక
మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. కానీ ప్రత్యేక హోదా ఊసే ఎత్త
లేదు.

 

గతం ఘనం

  పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు 2014పై రాజ్యస‌భ‌లో 2014 ఫిబ్ర‌వ‌రి 20న చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని
కొన్ని అంశాల‌ను ప్ర‌స్తావించారు. 13 జిల్లాల‌తో కూడిన  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స్పెష‌ల్ కేట‌గిరీ
స్టేట‌స్‌ను ఐదేళ్ల పాటు వ‌ర్తింప‌జేస్తామ‌ని చెప్పారు. దీని మీద ప్రతిపక్ష బీజేపీ
నేతలు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదని, పదేళ్లు కావాలంటూ పట్టుబట్టారు.
కాంగ్రెస్, బీజేపీ లు రెండూ పోటీ పడి ప్రకటనలు చేశాయి కానీ ఫలితం మాత్రం లేకుండా
పోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం
ప్రత్యేక హోదా ఊసెత్తకుండా రెండేళ్లు గడచింది.  

   

చంద్రబాబు
నిర్వాకం

ఎన్నికల
ప్రచారంలో తమకు ఓటేస్తే ప్రత్యేక హోదాను పదేళ్లు చేస్తామని, పదిహేనేళ్లు చేస్తామని
చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. బీజేపీ, టీడీపీ మిత్ర బంధంతోనే అన్నీ సాధ్యం అని
నమ్మబలికారు. తీరా ఓట్లేయించుకొన్నాక చంద్రబాబు ఆ ఊసే గాలికి వదిలేశారు. పైగా
సెక్సు రాకెట్ కుంభకోణం, రాజధాని భూ దందా, ఓటుకి కోట్లు కేసు తర్వాత మొత్తంగా
మాట  మార్చారు. కేంద్రానికి కోపం కలిగిస్తే
బండారం బయట పడుతుంది అన్న రీతిలో ప్రవర్తించారు. ప్రత్యేక హోదా అనేది సంజీవని
కాదని కాసేపు, హోదా ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత ని కాసేపు కాలక్షేపం చేశారు.

 

కేంద్రం
సన్నాయి నొక్కులు

ప్రత్యేక
హోదా అవసరం లేదని, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చంద్రబాబే చెబుతుండటంతో కేంద్ర
ప్రభుత్వ పెద్దలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. మరో వైపు గొప్పల కోసం దేశం మొత్తం
మీద అత్యధిక వ్రద్ది రేటు నమోదు అవుతోందని, లక్షల కోట్ల రూపాయిల మేర పెట్టుబడులు
ప్రవాహంలా వచ్చేస్తున్నాయని ప్రచారం చేసుకొన్నారు. దీంతో ఏపీకి ఎటువంటి ఉపశమన
చర్యలూ అవసరం లేదని కేంద్రం నిర్ధారణకు వచ్చింది. దీంతో ప్రత్యేక హోదా కు తాళం
పడుతోంది.

తాజాగా
పార్లమెంటులో ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా
ఊసెత్తకుండా సరిపెట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువే ఇస్తున్నామంటూ
వాదించారు. ప్యాకేజీలతో సరిపెట్టుకోండి అని సంకేతాలు పంపారు. చివరకు ప్రత్యేక
హోదాను అందని పండుగా మార్చేశారు.

 

Back to Top