మహాకూటమితో వచ్చి మాయమాటలు చెబుతున్న చంద్రబాబుకు తెలంగాణాలోని సామాన్యుడి సమాధానం.చంద్రబాబు: తెలంగాణా నా ప్రియ ప్రాంతం.తెలంగాణ సామాన్యుడు:  అందుకేనా ఇక్కడి ప్రాజెక్టుల మీద కేసులు పెడుతు అడ్డం పడుతున్నవ్.చంద్రబాబు: ఎపిలో ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణాకు అండగా ఉంటాను అంటే రెండు పడవలమీద కాళ్లేస్తానంటవ్...తెలంగాణ సామాన్యుడు: రెంటికీ కాకుండా గోదాట్లో పడతవ్ జాగ్రత్త. చంద్రబాబు: హైదరాబాద్ నేను కట్టలేదు. సైబరాబాద్ నగరాన్ని రూపకల్పన చేసాను పిచ్చోణ్ణి నేనుగాదు. తెలంగాణ సామాన్యుడు:  పిచ్చినాకెక్కింది అన్నట్టుంది నువు చెప్పేది. తెలంగాణా అభివృద్ధికి నేను అడ్డుపడలేదు అని నువ్వంటే సరిపోదు. నీపన్లు చూస్తే మాకనిపించాలి. చంద్రబాబు: ఆ రోజూ ఈరోజూ ఒకేమాట మీద ఉన్నాను అలాంటి ఒక్కమాట చెప్పు. తెలంగాణ సామాన్యుడు:  మాకైతే ఒక్కటి కూడా గుర్తురావడం లేదు. చంద్రబాబు:  కేసీఆర్ నన్ను తిడుతున్నదేమిటో అర్థం కావడం లేదు. తెలంగాణ సామాన్యుడు:  అర్థమైతే నాకు చెప్పండి నీకు అధికారం తప్ప ఇంకేం అర్థం కాదు. చంద్రబాబు:  తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉండడు. తెలంగాణ సామాన్యుడు: అది తెలియదు కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఉండబట్టే తెలుగుదేశం అధినేత హైదరాబాద్ వదలి అమరావతికి పారిపోయాడని తెలుసు.చంద్రబాబు:  దేశం కోసం రెండే ఫ్రంటులున్నాయ్ తెలంగాణ సామాన్యుడు:  అవును తెలుగుదేశం కోసమే అటు ఎన్డీయే కూటమి మొన్నటిదాకా పనిచేసింది. నిన్నటి నించి కాంగ్రెస్ కూటమి పనిచేస్తోంది. చంద్రబాబు: టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని తెలంగాణ సామాన్యుడు: అందుకే గ్లోబెల్ బహుమతి, భాస్కర్ అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం.చంద్రబాబు:  టెల్ ఫోన్ ను ట్యాప్ చేయడం సులభం తెలంగాణ సామాన్యుడు:  అవును నీకు అనుభవం ఉంది కదా ఓటుకు నోటు కేసులో నీ బ్రీఫింగ్ అంతా ట్యాపింగ్లోనే కదా దొరికింది. చంద్రబాబు:  హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతు అమరావతి ఆనంద నగరం, ఆయుష్షు పెరుగుతుంది, అభివృద్ధి చెందుతోంది అన్నావ్ కదా..తెలంగాణ సామాన్యుడు: హైదరాబాద్ మీద పడిఎందుకేడుస్తున్నావ్? తెలుసులే అమరావతి పేరు చెప్పి భ్రమరావతి చూపిస్తున్నావ్. చంద్రబాబు:  భారతదేశంలో నెంబర్ వన్ గా తెలంగాణా రాష్ట్రం ఉంటుందితెలంగాణ సామాన్యుడు: మరి దేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ వన్ అమరావతి అన్నావ్. అంటే అవన్నీ అబద్ధాలేనా?చంద్రబాబు: తెలంగాణాలో అభివృద్ధి జరగలేదు. అప్పులు పెరిగిపోయాయ్ తెలంగాణ సామాన్యుడు:  గురివింద గింజ తన నలుపెరుగదంట....అట్టుంది నువు చెప్పేటిది. తెలంగాణాలో సంగతి నీకెందుకయ్యా? అయినా నీ రాష్ట్రంలో మాత్రం నువు చేస్తున్నదేంటి? లక్షల కోట్ల అప్పుగాదా? రైతుల నుంచి గుంజుకున్న రాజధాని భూములు తాకట్లు పెడుతున్నావ్. బాండ్లని చెప్పి బారువడ్డీలకి అప్పులు తెస్తున్నావ్. ఇక్కడ కొచ్చి కబుర్లు చెబుతున్నావ్.చంద్రబాబు: ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపిస్తారా? నమ్మకమేనా? తెలంగాణ సామాన్యుడు: గంత అనుమానమైతే ఎట్ల సార్. మాకు నచ్చితే గెలిపిస్తాం. లేకుంటే కిందటిసారిలెక్కే మీ అందర్నీ కలిపి బొందపెడతం. చూడబోతే చేతిలో చెయ్యేసి ఒట్టు పెట్టండి, హారతి కర్పూరం మీద ప్రమాణం చేయండి అనేట్టున్నవే. చంద్రబాబు: మీలో టీఆర్ఎస్ బీజేపీ పంపిన మనుషులున్నారా? తెలంగాణ సామాన్యుడు: నువ్విలా భయం భయంగా అడగడం చూస్తుంటే ఎవరైనా దాడి చేస్తారేమో అని బిక్కుబిక్కుమని భయపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది ఆంధ్రాకాదు, విశాఖ ఎయర్పోర్టూ కాదు. ప్రతిపక్షం మీద దాడులు జరగడానికి.