టీడీపీకి సీబీఐ కోర్టు షాక్‌

* సీబీఐ పిటిషిన్‌ను తిరస్కరించిన కోర్టు 
* బాబు అండ్‌ కో కు ముచ్చెమటలు
* తీర్పుతో తెల్లబోయిన పచ్చ మీడియా 
* పత్తా లేని తెలుగు తమ్ముళ్లు 

గత వారం రోజులుగా ఏప్రిల్‌ 28 జడ్జిమెంట్‌ డే అని వి్రరవీగిన పచ్చ తమ్ముళ్లకు సీబీఐ కోర్టు కోలుకోలేని షాకిచ్చింది. జగన్‌ జైలుకెళ్లడం ఖాయమని అనుకుల మీడియా ద్వారా బూర ఊదిన వారంతా నీరసంతో సగం చచ్చిపోయారు. ఎండlదెబ్బకు తోడు సీబీఐ దెబ్బకు టీడీపీ నాయకులు గిలగిలలాడిపోతున్నారు. పనికిమాలిన పిచ్చి ఆధారాలను చేతిలో పట్టుకుని బ్రహ్మాస్త్రంలా పోజు కొట్టిన బాబు అండ్‌ కో కి ఇది నిజంగా కోలుకోలేని దెబ్బ. కుటిల రాజకీయాలతో వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడిగా పేరున్న చంద్రబాబుకు మాత్రం ఇది గట్టి షాక్‌. జగన్‌ను జైలుకు పంపించడం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ ఐదేళ్లు అధికారం వెలగబెడదాం అని కలలు కన్న చంద్రబాబు, లోకేష్‌ ఆశలపై సీబీఐ కోర్టు నీళ్లు చల్లింది.

కార్యకర్తలను భయపెట్టలేరు..
కేఎస్‌ఆర్‌ లైవ్‌ షోలో మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి చెప్పిన విషయాలను ఆధారాలుగా చూపించి వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను, జగన్‌ అభిమానులను భయపెట్టాలనేది టీడీపీ వ్యూహం. నిజానికి వారు తీసుకున్న వాదనల్లో అంత బలం కూడా లేదనేనది వారికి కూడా తెలుసు. కాకపోతే ఒకవైపు సోషల్‌ మీడియాలో లోకేష్‌తోపాటు చంద్రబాబు ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న దాడిని తట్టుకోలేకే జగన్‌ను కార్నర్‌ చేసే ప్రయత్నం చేసిందనేది వాస్తవం. పార్టీ నాయకుడిని జైలుకు పంపడం ద్వారా కార్యకర్తలను, పార్టీని ఇబ్బంది పెట్టవచ్చనేది టీడీపీ వ్యూహం. అందులో భాగంగానే ఇంటూరి రవికిరణŠ  మీద కేసులు కావొచ్చు.. అంతకముందు కాపు ఉద్యమం సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీద కేసులైనా.. చెవిరెడ్డిని జైలుకు పంపడం వంటివన్నీ కార్యకర్తల ఆత్మసై్థర్యాన్ని దెబ్బీతీసేందుకు వారు చేసే కుట్రల్లో భాగమే. సోషల్‌ మీడియా ఈ రోజు వైయస్‌ ఆర్‌సీపీ కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. ఇంతకముందే సోషల్‌ మీడియానే అడ్డం పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని అందరికీ తెలుసు. దేశంలో నరేంద్రమోడీ ప్రభంజనం కావొచ్చు.. అమెరికాలో ట్రంప్‌ గెలుపు కావొచ్చు.. ఇలా 21వ శతాబ్దంలో ప్రతి విజయం వెనుక సోషల్‌ మీడియా హస్తం ఉందనేది ఒప్పుకోకతప్పని వాస్తవం. 

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా...
సాక్షి టీవీ లైవ్‌లో ఒక మాజీ సీఎస్‌ పంచుకున్న అనుభవాలను జగన్‌కు ముడిపెట్టి ఆయన్ను ఇబ్బందులు పెట్టబోయిన పచ్చ మీడియా గురిగింజ నీతిని ఫాలో అవుతున్నట్టుంది. గతంలో ఎన్‌టీవీతో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఎన్నికల్లో తాను రూ. 11 కోట్లు ఖర్చు చేశానని చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంత ఖర్చు చేయడం నేరం. గెలిచినప్పటికీ వారిని డిస్‌క్వాలిఫై చేయాలి. నిజానికి దీనికి ఆధారాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా కోడెల టీవీతో అన్నమాటలివి. అందులో ఆయన మాటలు, వీడియా రెండూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పక్కా ఆధారాలున్నా కేసు ఇప్పటికీ విచారణలోనే ఉంటే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉన్న మీడియా అంశాన్ని ఆధారంగా చూపి జగన్‌ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని చెప్పడం.. జైలుకెళ్లడం ఖాయమని అనుకుల మీడియాలో ప్రచారం చేయడం చూస్తుంటే న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేయగలనన్న ధీమా బాబుకు ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంతో ఏమైనా చేయగలమని వి్రరవీగే బాబు ప్రభుత్వానికి తాజా సీబీఐ కోర్టు తీర్పు చెంప దెబ్బ లాంటింది. తెలుగులో ఉన్న అన్ని మీడియా సంస్థలను లోబర్చుకున్న బాబుకు సాక్షి కొరుకుడు పడని కొయ్యగా మారడంతో గజిని మాదిరిగా కేసులు పెట్టి విఫలయాత్రలు చేస్తున్నాడు. ఏదేమైనా ఈ ఒక్క తీర్పుతో చంద్రబాబుకు తత్వం బోధపడితే మంచిది లేదంటే సోషల్‌ మీడియా నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఎదురయ్యే తిరుబాటుతో పళ్లన్నీ రాలిపోవడం ఖాయం.
Back to Top