అసెంబ్లీ వేదిక‌గా రాజ‌కీయ కుట్ర‌

హైద‌రాబాద్‌ : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌న  క‌క్ష‌లు, కార్ప‌ణ్యాల‌కు పెట్టింది పేరు. పాల‌న చేప‌ట్టి ఏడాది గ‌డుస్తున్నా అదే ప‌ద్ద‌తి కొన‌సాగుతోంది.
అసెంబ్లీ నుంచి దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టం తొల‌గించాల‌న్న నిర్ణ‌యం అదే కోణంలో సాగుతోంది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండ‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణించ‌టంతో తెలుగు జాతి యావ‌త్తూ గుండెలు అవిసేలా శోకించింది. మ‌న‌స్సు నిండా మ‌హా నేత‌ను నింపుకొని త‌ల్ల‌డిల్లిపోయింది. ఇందుకు ప్ర‌తిగా రాష్ట్ర ప్ర‌జాస్వామ్య దేవాల‌యంగా చెప్పుకొనే అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ చిత్ర‌ప‌టాన్ని ఉంచాల‌ని గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అప్ప‌టి స్పీక‌ర్ చొర‌వ‌తో దీన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్థంతి సంద‌ర్భంగా అసెంబ్లీలో స్పీక‌ర్ త‌దిత‌రులు అక్క‌డ అంజ‌లి ఘ‌టించ‌టం జ‌రిగేది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైఎస్సార్‌సీపీ శాస‌న‌స‌భ ప‌క్షం అక్క‌డ కొన్ని కార్య‌క్ర‌మాలు సైతం నిర్వ‌హించింది.

అయితే ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిపోయిన వైఎస్సార్ చిత్ర‌ప‌టం అక్క‌డ ఉండ‌టం, ప్ర‌జ‌లంద‌రికీ జ‌న నేత గుర్తుకొని రావ‌టం చంద్రబాబుకి న‌చ్చ‌టం లేదు. దీంతో కుట్రతో ఆ చిత్ర ప‌టాన్ని అక్క‌డ నుంచి తొల‌గించాల‌ని నిర్ణ‌యించారు. అనుకొన్న‌దే త‌డ‌వుగా అసెంబ్లీ సిబ్బందిపై ఒత్తిడి తెప్పించి దాన్ని అక్క‌డ నుంచి తొల‌గించారు. అసెంబ్లీ లాంజ్ నుంచి చిత్ర ప‌టాన్ని తొల‌గించినా, ప్ర‌జ‌ల గుండెల్లోంచి మ‌హా నేత ను తొల‌గించ‌లేమ‌ని తెలుసుకోలేక పోయారు.

అయితే ఇందులో మ‌రో రాజ‌కీయ కుట్ర కూడా దాగి ఉందిన విశ్లేష‌కులు చెబుతున్నారు. రాజ‌ధానిని హోల్ సేల్ గా సింగ‌పూర్ కి అమ్మేయ‌టం, పుష్క‌రా్ల‌లో సినిమా షూటింగ్ కోసం 30 మందిని బ‌లి పెట్ట‌డం, ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోవ‌టం, యూనివ‌ర్శిటీ లో రిషితేశ్వ‌రి చ‌నిపోయినా వాస్త‌వాల్ని తొక్కిప‌ట్ట‌డం వంటి అంశాల‌పై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా నిల‌దీస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుచేత వైఎస్సార్‌సీపీ మ‌న‌స్సుని మ‌ళ్లించ‌టానికి ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగార‌ని అంచ‌నా వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఈ చిత్ర‌ప‌టం గురించి ఆందోళ‌న చేస్తుంటే, త‌మ ప‌బ్బం తాము గ‌డుపుకోవ‌చ్చ‌న్న‌ది ప‌చ్చ చొక్కాల కుట్ర‌గా చెబుతున్నారు.
Back to Top