పుష్క‌రాల మ‌ర‌ణాల‌పై తూతూ మంత్రం చ‌ర్య‌లు..!

చంద్ర‌బాబు పాప‌మే అసలు శాపం
తెలివిగా దారి మ‌ళ్లించిన వైనం
తూతూ మంత్రం విచార‌ణ‌కు ఆదేశం

రాజ‌మండ్రి: పుష్క‌రాల తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు మ‌సిపూసి మారేడు కాయ చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు సినిమా షూటింగ్ కోసం దాదాపు 30 మందిని బ‌లిపెట్టిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

జ‌రిగింది ఏమిటంటే..!
ర‌క ర‌కాల కుంభ‌కోణాల్లో ఇరుక్కొని పోయిన చంద్రబాబు.. అప‌ఖ్యాతి నుంచి బ‌య‌ట ప‌డేందుకు పుష్క‌రాల్ని ఎంచుకొన్నారు. జాతీయ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించుకొన్నారు. వీఐపీ ఘాట్‌లో స్నానాదికాల ఆచ‌రించ‌కుండా పుష్క‌రాల ఘాట్ లోకి కుటుంబ స‌మేతంగా ప్ర‌వేశించి షూటింగ్ చేయించుకొన్నారు. ప్ర‌జ‌ల్ని ఎక్కువ కాలం క్యూ లైన్ల‌లో ఉంచ‌టంతో తొక్కిస‌లాట జ‌రిగి అమాయ‌కులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. చంద్ర‌బాబు కోసం ఇంత మందిని బ‌లి పెట్ట‌డం ఎంత వ‌ర‌కు న్యాయం అనే ప్ర‌శ్న త‌లెత్తింది.

తెలివిగా ప‌క్క దారి
విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున రావ‌టంతో చంద్ర‌బాబు తెలివిని ప్ర‌దర్శించారు పుష్క‌రాలు పూర్త‌య్యే వ‌ర‌కు రాజ‌మండ్రిలో ఉంటాన‌ని చెప్పి హ‌డావుడి చేశారు. ఎల్లో మీడియాతో ప్ర‌చారం చేయించుకొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిగా ద‌ర్యాప్తు చేయించి కార‌కుల‌పై చర్య‌లు తీసుకొంటామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించుకొన్నారు. పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిగితే చంద్ర‌బాబు క‌ప‌ట నాటకం బ‌య‌ట ప‌డేది.

తూతూ మంత్రంగా చ‌ర్య‌లు
పుష్క‌రాలు పూర్తయి ఎన్ని రోజులు గ‌డిచినా విచార‌ణ ఊసెత్త‌కుండా కాల‌క్షేపం చేశారు. దీని మీద విమ‌ర్శ‌లు రావ‌టంతో వ్య‌వ‌హారాన్ని ప‌క్క దారి ప‌ట్టించేందుకు నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా అమ‌లాపురం డివిజ‌న్ కు చెందిన డీఎస్పీకి ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు అప్ప‌గించి చేతులు దులుపుకొన్నారు. సీనియ‌ర్ ఐపీఎస్‌లు, ఐఎఎస్ ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన పుష్క‌రాల్లో త‌ప్పు తేల్చాల్సిన బాధ్య‌త‌ను జూనియ‌ర్ అధికారికి అప్ప‌గిస్తే ఏ విధంగా న్యా యం జ‌రుగుతుంద‌న్న ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తోంది. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top