కుట్ర చతుష్టయం ఆటలు ఎన్నాళ్లు!

అభిప్రాయం  

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీ యాల్లో ప్రత్యేకించి ఎన్నికల వాతావరణంలో చాలా జుగుప్సాకరమైన, కుట్ర పూరితమైన రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబు, రఘువీరా రెడ్డి, పవన్‌ కల్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ తదితరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రత్యేకించి జగన్‌మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వీరికి బహుజన సమాజ్‌పార్టీ, వామపక్షాలు జత అయ్యాయి. ఏపీలో వైఎస్‌ జగన్‌కి వచ్చే దళితుల ఓట్లను చీల్చడానికి మాయావతి పార్టీకి 29 అసెంబ్లీ సీట్లు కేటాయించడం, సీపీఐ, సీపీఎంకు 14 సీట్లు కేటాయించడం ద్వారా వైఎస్సార్‌ సీపీ ఓట్లను, ఓటర్లను నిలువరించడం, చీల్చే ఉద్దేశంతో రాజకీ యాలు నడుస్తున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి, అమిలి నేని సురేంద్రబాబుకు టికెట్టు తప్పించి ఓ అనామకు డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి రఘువీరా రెడ్డికి ఎన్నికల్లో గెలిచే వాతావరణం కల్పించాలని చంద్రబాబు, రాహుల్‌గాంధీ రాజకీయాలు చేయడం గర్హనీయం. 

తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఓటుతో బుద్ధి చెప్పారు. ఆ అనుభవంతో ఏపీలో పొత్తులు లేకుండా లోపాయి కారి ఒప్పందాలు, కుట్రలు, కుతంత్రాలతో వైఎస్సా ర్‌సీపీకి వ్యతిరేకంగా నేడు రఘువీరారెడ్డి, పవన్‌ కల్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ తదితరుల ముసు గులో వైఎస్సార్‌సీపీ వ్యతిరేక రాజకీయాలకు చంద్ర బాబు నడుంబిగించారు. దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను చంద్రబాబే చేపట్టారని, ఆ పార్టీలకు, అభ్యర్థులకు నిధులు అంది స్తున్నారని బహిరంగంగానే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఐదేళ్లపాలన తరువాత చంద్రబాబు తాను చేపట్టిన విధానాలేమిటో ప్రజ లకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడగడం సబబు. కానీ, పోల్‌ మేనేజ్‌మెంట్, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్, ఐటీ గ్రిడ్స్‌ లాంటి సంస్థల ద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించడం, తన అనుకూల శక్తులను మాత్రమే ఓటరు జాబితాలో చేర్చడంతోపాటు, డబ్బు ప్రలోభాల ద్వారా ఎన్నికల్లో పోటీకి చంద్ర బాబు వ్యూహం పన్నారు. ప్రస్తుత హింసా రాజకీయ వాతావరణంలోనూ నూతన తరహా గాంధేయ విధానాలు పాటించే వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించడం ద్వారా టీడీపీ పాలకవర్గం బహిరం గంగా భయాందోళన కలిగించే చర్యలకు పాల్ప డింది.

వివేకా దారుణ హత్య అనంతరం నిష్పక్షపా తమైన విచారణ జరపకుండా ముఖ్యమంత్రి స్థాయి  లోని వ్యక్తి, ఆ పార్టీ మంత్రులు కేసును పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వివేకానందరెడ్డి కుమార్తె భారతదేశ ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు, పులివెందు లలో ఎన్నికల విజయాన్ని నిలువరించడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, ఆయన్ని కడప రాజకీయాలకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు కనుసన్నల్లో ఈ కుట్ర జరి గింది. కానీ గతంలో తన తండ్రి వైఎస్‌ రాజారెడ్డి హత్య ద్వారా తనను కడప జిల్లాకు పరిమితం చేయాలని సాగించిన తరహా కుట్రలకు తాను ప్రభావితం కానని, తాను ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పరిమితమయ్యే నాయకుడిని కానంటూ  వైఎస్‌ రాజ శేఖరరెడ్డి ఆనాటి వార్తా పత్రికలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్త పత్రిక రాయలసీమ ప్రతినిధితో కలసి ఈ వ్యాస రచయిత కూడా ఆనాటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అదే విధంగా తన తండ్రి వైఎస్సార్‌ మరణం వెనుక, ఇప్పుడు తన చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య వెనుక కూడా కుట్రదాగి ఉందని తనకు అనుమానం ఉన్నప్పటికీ ప్రజలలోకి మరింతగా వెళ్లడానికి కృషి చేస్తాను తప్పితే ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పాల్పడబోనని వైఎస్‌ జగన్‌ ప్రస్తుతం స్పష్టంగా ప్రకటించారు. 

వైఎస్‌ వివేకా హత్య కేసును నీరుగార్చడానికి, పక్కదారి పట్టించడానికి జరుపుతున్న తతంగానికి వ్యతిరేకంగా ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత రాష్ట్ర ఎన్నికల కమిషన్, జాతీయ ఎన్నికల కమిషన్, జాతీయ హోంశాఖ అధికారులను కలసి,  తన తండ్రి మరణంపై, ప్రస్తుతం జరుగుతున్న విచారణ నిష్ప క్షపాతంగా జరిగేటట్టు చూడాలని ఎంతో సంస్కా రంగా, నిబ్బరంగా జరుపుతున్న రాజకీయపోరాటం అందరి హృదయాలను కదిలిస్తోంది. వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరప కుండా సాగుతున్న కుట్రలను, కుతంత్రాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిశితంగా గమనిస్తున్నాయి. జరుగుతున్న ఎన్నికల్లో సమరశీలంగా పోరాడటానికి ఉద్యుక్తులవుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో గెలుపు సాధించడం అనే ఒకే ధ్యేయంతో సాగుతున్న రాజకీయ ప్రచారంలో ప్రజలు ఉద్యుక్తులు కావడమే నేటి కర్తవ్యం.


ఇమామ్‌
వ్యాసకర్త కదలిక సంపాదకులు  

 

తాజా వీడియోలు

Back to Top