హైదరాబాద్ : అమరావతి రాజధానికి అన్నీ ఫ్రీ అంటూ ఊదర గొడుతున్న చంద్రబాబు బండారం బయట పడుతోంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అంతా సింగపూర్ ఉచితంగా అందచేస్తోందని పదే పదే చెబుతున్నారు. ఇందుకోసం పుష్కరాల సమయంలో ప్రత్యేక విమానంలో సింగపూర్ టీమ్ ను రాష్ట్రమంతా, ప్రత్యేక హెలికాప్టర్ లో గోదావరి అంతా తిప్పి శాలువా కప్పి సత్కరించారు. మాస్టర్ ప్లాన్ ఉచితంగా తయారుచేయటంలోని అంతరార్థం నెమ్మది నెమ్మదిగా బయట పడుతోంది. <br/><br/>మాస్టర్ ప్లాన్ తయారుచేయించినప్పుడు కుదుర్చుకొన్న ఒప్పందంలోని అంశాలు నెమ్మది నెమ్మదిగా బయట పడుతున్నాయి. రాజధాని అబివృద్ది పనులు కచ్చితంగా సింగపూర్ కంపెనీలకే అందేట్లుగా ప్రభుత్వం నుంచి ఒప్పందం చేయించారు. స్విస్ చాలెంజ్ అన్న మాటకు అర్థం అదే అని స్పష్టం అవుతోంది. అంటే రాజధాని పనుల్ని ఎలా చేసేదీ సింగపూర్ సంస్థలు తెలియచేస్తాయి, అప్పుడు అదే పనుల్ని చేసేందుకు ఇతర సంస్థలు ముందుకు వచ్చినట్లయితే, వాటిని కేటాయించాలో వద్దో అని కూడా సింగపూర్ సంస్థల్నే అడుగుతారు. అప్పుడు సింగపూర్ సంస్థలు ముందుకు వచ్చి ఏ ఏ పనుల్ని స్వీకరిస్తే వాటికి ఆయా పనుల్ని అప్పగించేస్తారు. అప్పుడు మిగిలిన సంస్థల్ని ఇంటికి పంపించేస్తారు. <br/>పుష్కరాలకు ముందు అన్నీ అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ సంబరాలు చేసుకొన్న ప్రభుత్వానికి సింగపూర్ కంపెనీల నుంచి కబురు వచ్చేసింది. మొదటి విడతగా రూ. 50వేల కోట్లు సిద్దం చేయాలని వర్తమానం అందించారు. అది కూడా రాజధాని అభివృద్దికి అవసరమైన మౌళిక సదుపాయాల్ని కల్పించటానికే అని తెలుస్తోంది. ఇదంతా కూడా రాజధాని మొదటి దశకు మాత్రమే అంటే..! మొత్తం పనుల్లో 18 శాతం పూర్తి చేయటానికే అన్న మాట..!