– ఉత్తుత్తి హామీలతో బీసీలకు చంద్రబాబు ఎర– ఇస్త్రీపెట్టెలు, డోలు సన్నాయి, కత్తెరలు పంపిణీ– ఒక్కరోజులోనే ‘పేదరికంపై గెలుపు’ – ఊదరగొడుతున్న పచ్చ మీడియా
ఎన్నికలొస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీసీలకు చంద్రబాబు ‘ఎర’ వేస్తున్నాడు. ఒక్కో కులానికి ఒక్కో పడికట్టు పదాన్ని సంక్షేమ పథకంగా పేర్లు పెట్టుకుని లను జనోద్ధారకుడిగా ప్రజెంట్ చేసుకునేందుకు స్కెచ్ సిద్ధం చేశాడు. నాలుగేళ్లుగా ముస్లింలను పక్కన పెట్టిన చంద్రబాబు హడావుడిగా ఎండీ ఫరూఖ్‌కు మంత్రి పదవి ఇచ్చి ‘నారా హమారా’ అని బిల్డప్ ఇచ్చాడు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చనిపోతే విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సింది పోయి ఆయన కొడుకును మంత్రిని చేసి గిరిజనులందరికీ న్యాయం చేసేసినట్టు.. పేదరికం నుంచి బయట పడేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీసీల వంతు వచ్చింది. విజయవాడలో కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పేదరికంపై పోరాటం.. ఆదరణ–2 అని పబ్లిసిటీకి ప్లాన్ వేశాడు.
2014 ఎన్నికలకు ముందు ప్రతి కులాన్ని మేనిఫెస్టోలో చేర్చి హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఎన్నికలయ్యాక నెరవేర్చలేదు సరికదా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక పార్టీ వెబ్‌సైట్ నుంచే మేనిఫెస్టోను తొలగించడం చూస్తుంటే అంతకంటే మోసం ఉండదు. ఇది సమాధానం చెప్పుకోలేక పలాయన మంత్రం చిత్తగించడమే అవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడూ వారికి కనీస మర్యాద ఇవ్చింది లేదు. కేవలం ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు అందజేసి బీసీ జనోద్ధారకుడిగా బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు.. సమస్యలపై ముఖ్యమంత్రిని కలవడానికి సెక్రటేరియట్‌కు వస్తే ఘోరంగా అవమానించడం మనం చూశాం. మిమ్మల్ని ఇక్కడికి రానీయడమే తప్పు అని సెక్రటేరియట్ వద్ద క్షురకులను ఉద్దేశించి హేళనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది. మత్స్యకారులను తొక కత్తరిస్తా.. నన్నే ఎదిరిస్తారా అని హెచ్చరించారు. చంద్రబాబుకు కులవత్తులు చేసుకునే బీసీలే కాదు.. ఉన్నత విద్యావంతులుగా ఉండి సమాజంలో గౌరవించబడుతున్న బీసీలను కూడా చంద్రబాబు లక్ష్యపెట్టరు. దీనికి అందరికీ తెలిసిన ఉదాహరణ.. బీసీలు హైకోర్టులో న్యాయమూర్తులు కాకుండా కేంద్రానికి లేఖ రాసి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఈ లేఖను జస్టిస్ ఈశ్వరయ్య బహిర్గతం చేసి బీసీలపై చంద్రబాబు అక్కసు ఎలా ఉందో బయటపెట్టారు. ఓట్ల కోసం బీసీ ముసుగు ఓట్ల రాజకీయం కోసం బాబు వేసుకొన్న అనేక ముసుగుల్లో ‘సామాజకన్యాయం’ ఒకటి. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చాక.. సామాజిక న్యాయం ఒక నినాదంగానే మిగిలింది. 2009 ఎన్నికలకు ముందు బీసీ గర్జన పేరుతో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో బీసీలకు 100 సీట్లు ఇస్తానని డిక్లరేషన్ ప్రకటించారు. కానీ, 2009లో ఇచ్చిన మాట తప్పారు. 2014లో ఆ ఊసే లేదు. కష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే తప్ప.. వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదు. బీసీలు మెజార్టీగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం మినహా లోక్‌సభ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లివ్వడం లేదు. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వరకు రెండు కులాలకే లోక్‌సభ టికెట్లు కేటాయించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు మొండి చేయి చూపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వృత్తిదారులైన బీసీ కులాలు అనేకం ఉన్నాయి. వారందరికీ దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎంతమంది బీసీలకు టికెట్లిస్తారో బాబు చెప్పగలరా?

ఇప్పుడు కొత్తగా ‘బీసీలకు కోసం బడుగు తేజం‘ అనే కార్యక్రమము ద్వారా దగ్గర అవ్వాలని కలలు కంటున్నారు. 2014లో ఇచ్చిన హామీలు ‘బీసీ డిక్లరేషన్‘, ‘ప్రతి సంవత్సరం పది వేల కోట్ల నిధులతో బీసీ సబ్ ప్లాన్‘ఇంత వరకు అమలు చేయలేదు. పైగా కాపులు తమకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమాలు చేస్తే.. బీసీలకు కాపుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహారం నడిపారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైన M్క, Mఔఅ, Mఔఇ, మంత్రులు ఎవ్వరూ కుల సంఘాలు ఏర్పాటు చేసే మీటింగులకు, కుల సంఘాల వనభోజనాలకు వెళ్లవద్దండి.కులాల ద్వారా ఎవ్వరూ అధికారం చేపట్టలేరని స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ఈ రోజు ‘బీసీల కోసం బడుగు తేజం‘కార్యక్రమము ద్వారా ‘బీసీ డిక్లరేషన్‘, ‘బీసీ సబ్ ప్లాన్‘అమలు చేసే విషయాన్ని పూర్తిగా మరిచి పోయే విధంగా ఆదరణ పథకం–2 ద్వారా పనిముట్లు ఇస్తామని కబుర్లతోటే కాలక్షేపం చేస్తున్నాడు.
వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీ కులాల సామాజికంగా అభివద్ధి సాధించాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని కేవలం కుల వత్తి చేసుకునే వర్గాలుగా చూస్తూ చంద్రబాబు హయాంలో ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, మోకులు, మొగతాళ్లు, సైకిళ్లు (అవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివన్న విషయం అప్పట్లోనే చెప్పుకున్నారు) ఇచ్చి ఎంతో చేశానని విస్తత ప్రచారం చేసుకున్నారు. బీసీ వర్గాల్లో వద్ధులను ఆదుకోవటానికి వైఎస్ పెన్షన్లు మంజూరు చేస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షనర్లలో ఒకరు చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్ ఇచ్చే విధానం అమలులో ఉండేదని వారు గుర్తుచేస్తున్నారు.