దుష్టపాలనను అంతం చేద్దాం 

గ‌న్న‌వ‌రం స‌భ‌లో వైయ‌స్ ష‌ర్మిల‌

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

ప్రత్యేక హోదా బతికి ఉండటానికి వైయస్‌ జగన్‌ కారణం

 నాడు వైయస్‌ఆర్‌ సుపరిపాలన..నేడు చంద్రబాబు దుష్టపాలన 

రాజ‌ధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు

టీడీపీ నాయకులు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని అడ‌గండి

 

కృష్ణా జిల్లా: చంద్రబాబు దుష్టపాలనను అంతం చేయడానికి మనమంతా ఏకమవుదాం. ఏప్రిల్‌ 11వ తేదీన జరిగే పోలింగ్‌లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైయస్‌ షర్మిల రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం హనుమాన్‌ జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. 

ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి. ప్రజల కోసం ఇలాంటి పథకాలను అమలు చేయాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక మాదిరిగా నిలిచాడు. నీది ఏ కులం, ఏ మతం, నా పార్టీనా, అవతలి పార్టీనా అని అడగకుండా.. మన, పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు అది ఒక్క వైయస్‌ఆర్‌ మాత్రమే. 

వైయస్‌ఆర్‌ సుపరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు దుష్టపాలనను చూస్తున్నారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొదటి సంతకం అవుతుందని, దాంట్లో కూడా రైతులను చంద్రబాబు దగా చేశాడు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. రుణమాఫీ చేయకపోగా.. ఇప్పుడు పసుపు – కుంకుమ అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు మాటలను నమ్మి మరోసారి మోసపోతారా..? విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ లేదు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులపాలవుతున్నారని ఎంతో మంది విద్యార్థులు చదువులు మానేశారు. ఆరోగ్యశ్రీ లిస్టులో కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించారు. సామాన్యుడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని శాసిస్తున్నాడు. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జబ్బులు వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తారా.. ? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన ప్రజల గురించి ఇలాగే ఆలోచిస్తాడా..? 

రూ. 15 వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు రూ. 60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానన్నాడు, చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటుంటే ఇవాల్టికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. 

చాలా అనుభవం ఉంది చంద్రబాబు రాజధాని కడతారని ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చాడు. కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చారంట.. కానీ, చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ, ఇంకో ఐదేళ్లు సమయం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట.. శ్రీకాకుళం జిల్లాను హైదరాబాద్‌ను చేస్తాడంట. మన చెవుల్లో పూలు, క్యాబేజీలు పెడతాడంట. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా.. ? 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. సామాన్యులకు రాలేదు కానీ చంద్రబాబు కొడుకు పప్పుకు వచ్చింది. కనీసం జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక అయినా గెలిచాడా.. లోకేష్‌. ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. చంద్రబాబు కొడుకు పప్పుకు మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. మన నెత్తిన టోపీ పెడుతూ.. చంద్రబాబు కొడుకు బంగారు భవిష్యత్తు అంట. 

ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబుదే. బీజేపీకి అమ్ముడుపోయి  ప్యాకేజీ తీసుకుంటే కమీషన్లు వస్తాయని చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టాడు. ఇది అన్యాయం కాదా..? చంద్రబాబును ప్రజలంతా అడగాలి. దమ్ముంటే నిజం చెప్పమని అడగాలి. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బతికి ఉందంటే దానికి కారణం వైయస్‌ జగన్‌ చేసిన ఎన్నో ప్రయత్నాలు లేవు.  ఢిల్లీలో ధర్నాలు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు, ప్రతి జిల్లాలో యువభేరీలు, బందులు, రాస్తారోకోలు, ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. తరువాత రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే చంద్రబాబు నోట హోదా అనే మాట వచ్చేదా..? చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంది జగనన్న వల్లే. దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. కానీ చంద్రబాబు నిజం చెప్పరు. నాన్నగారు చెప్పేవారు...చంద్రబాబు నెత్తిన ఒక శాపం ఉందంట. ఏ రోజు అయితే నిజం చెబుతారో ఆ రోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అయిపోతుందంట. అందుకే నిజం చెప్పరు. 

గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని కొత్త అబద్ధాలు ఆడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రజల కోసం ఏ మేలు చేయలేదు. లోకేష్, హెరిటేజ్, తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం మాత్రమే పనిచేశారు. ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఆఖరి నాలుగు నెలల్లో మాత్రం పసుపు – కుంకుమ, పెన్షన్‌ పెంపు, భృతి అంట చేపలకు ఎర వేసినట్లు వేస్తున్నాడు మోసపోతారా.. నిజంగా చంద్రబాబుకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దమ్ముంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు పిల్లల కోసం కట్టిన ఫీజు అంతా చంద్రబాబు బాకీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. అంటే ఈ ఐదేళ్లలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 25 వేలు బాకీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ తీర్చమని చెప్పండి. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు, విద్యార్థులకు ఐప్యాడ్‌లు ఇస్తామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో అక్షరాల రూ. 1.20 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి మీ ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని అడగండి.  చేనేతలు, రైతులు, డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఆ బాకీ మొత్తం తీర్చమని అడగండి. డబ్బులు పెట్టి మీ ఓట్లు కొనడానికి చూస్తారు. నిజానికి వాళ్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీ బాకీ తీరదు. మళ్లీ మోసపోవద్దు నిన్ను నమ్మం బాబు అని తేల్చిచెప్పండి. 

తొమ్మిదేళ్లు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై చేయనిపోరాటం లేదు. ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు.. వారి ఇబ్బందులు తెలుసుకొని అర్థం చేసుకున్నాడు. కులాలకు, మతాలకు అతీతంగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు ఆశీర్వదించండి. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పెట్టుబడి సాయం కింద మే నెలలోనే ప్రతి రైతుకు రూ. 12,500 ఇస్తారు. గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ. 4 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను కూలీకి తీసుకెళ్లకుండా.. స్కూల్‌కు పంపిస్తే ప్రతి ఏటా రూ. 15 వేలు ఆ తల్లిచేతిలోనే పెడతారు. డ్వాక్రా మహిళల రుణాలు ఎంత ఉంటే అంత నాలుగు దఫాల్లో తీర్చుతూ ఆ మహిళల చేతుల్లోనే పెడతారు. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లు నిండిన తరువాత ఏకంగా రూ. 75 వేలు ఆర్థిక సాయం చేస్తారు. విద్యార్థులు ఏ చదువులు చదివినా ప్రభుత్వమే ఎన్ని లక్షలు ఖర్చు అయినా చదివిస్తాం. ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకానికి, ఆరోగ్యశ్రీకి పునర్జీవం తీసుకువస్తాం. 

వైయస్‌ జగన్‌ మాత తప్పుడు, మడమ తిప్పడు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యానికి మళ్లీ స్వాగతం పలకండి. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట్రావు అన్నను నిలబెడుతున్నాం. గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మనసులో తలచుకొని మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని జగనన్నకు ఇవ్వాలని కోరుతున్నాం. ఫ్యాన్‌ గుర్తుపై వేస్తున్న ప్రతి ఓటు రాజన్న రాజ్యం కోసం వేస్తున్నట్లని మర్చిపోవద్దు.  

Back to Top