దుష్ప్రచారంపై కువైట్ వైయస్ఆర్ సిపి ఖండన

కువైట్‌, 15 సెప్టెంబర్‌ 2012: బ్రదర్ అని‌ల్ కుమా‌ర్‌ను కువైట్‌ పోలీసులు అరెస్టు చేశారంటూ కొన్ని ఛానళ్ళు దుష్ప్రచారం చేయడాన్ని
వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ కువైట్ కో-ఆర్డినేట‌ర్ ఇలియా‌స్ తీవ్రంగా ఖండించారు. వై‌యస్‌ఆర్‌ కుటుంబంపై బురద చల్లాలనుకునేవారే ఇలాంటి పనికిమాలిన ప్రచారానికి
దిగుతున్నారని ఆయన విమర్శించారు. 

కువైట్ ఇస్లామి‌క్ పార్టీ పార్లమెం‌ట్ సభ్యులకు కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే వారు బ్రద‌ర్ అని‌ల్ కుమా‌ర్ సభను వ్యతిరేకించారని
ఇలియా‌స్‌ వివరణ ఇచ్చారు.. కువైట్ మాజీ పార్లమెం‌ట్ సభ్యుడు ముబార‌క్ అ‌ల్ దువేలాకు సమస్యను
వివరించినప్పుడు ఆయన పార్లమెంట్‌ సభ్యులతో మాట్లాడి బ్రదర్ అని‌ల్ కుమా‌ర్ కార్యక్రమానికి
అనుమతించారని ఇలియా‌స్ ‌తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top