హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో‌ జగన్ పర్యటన

హైదరాబాద్, 23 నవంబర్ 2013:

హెలెన్ పెను తు‌పాను ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 28న కుప్పంలో ఆయన ప్రారంభించవలసిన సమైక్య శంఖారావం యాత్రను 30వ తేదీకి మార్చినట్లు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్రం కార్యాలయం శనివారం హైదరాబా‌ద్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 నుంచి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్రను కుప్పంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే హెలెన్ తుపాను బాధితులను పరామర్శించి, ఆ తర్వాత సమైక్య శంఖారావం యాత్ర చేపట్టాలని శ్రీ జగన్ భావించినట్లు వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

Back to Top