స్పీకర్ : వాసిరెడ్డి పద్మ - జనవరి 26, 2012

ఎమ్మార్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ధర్యాప్తు చేస్తున్న తీరును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసులో అసలు దోషుల్ని వదిలేసి తాము అనుకున్న వారిని దోషులుగా చూపించేందుకు సీబీఐ ఎందుకింత దిగ జారుతుందో మాకు అర్ధంకావడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంభానికి సన్నిహితుడైన సునీల్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును చూసినా, ఎమ్మార్ పై గతంలో విజిల్లెన్స్ అండ్ ఎంఫోర్సుమేంట్ విభాగం ఇచ్చిన నివేదికకు చూసినా దీన్లో అప్పటి సీయం  చంద్రబాబునాయుడు గారి కుట్ర బుద్ది స్పష్టంగా బయటపడుతోంది. కానీ పక్షపాతంతో బరితెగించి ముందుకు పోతున్న సీబీఐ కి ఇవేవి పట్టకపోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తన రిపోర్ట్ లో పేర్కొన్న విషయాన్ని తానే పట్టించుకోకుండా సీబీఐ సాగిస్తున్న ధర్యాప్తు ఎన్నో సందేహాలకు తావిస్తోంది. ఆ అంశాల్ని మీడియా దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రకటన. తాను గనుక నిష్పాక్షికంగా ధర్యాప్తు చేస్తున్నాని భావిస్తే సీబీఐ ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి. లేకుంటే ఇకనుంచైనా నిష్పాక్షికంగా  ముందుకెళ్ళాలి. ఇవేవి చేయకుంటే జనంలో విశ్వసనీయతపోతుంది. ఢిల్లీ రాజకీయ బాసుల తాబెదారుగా దీనిపై వస్తున్న విమర్శలు నిజమని రూడీ అవుతాయి.

-ఫైవ్ స్టార్ హోటల్ ,కన్వంషన్  సెంటర్, 18 రంద్రాల గోల్ఫ్ కోర్స్,దాని చుట్టూ శ్రీమంతుల విల్లాలు... ఇలా ఉండే ఓ ఇంటెగ్రేటెడ్ టౌన్షిప్  నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు  1999వ సంవత్సరంలోనే భావించారు. ఇందుకోసం ఎమ్మార్ కు సంబందించిన కోనేరు ప్రసాద్ తో 2000వ సంవత్సరం నుంచే సంప్రతింపులు మొదలుపెట్టారు. అయితే వ్యవహారాన్ని ప్రజాస్వామ్యమైన ముసుగులో నడిపించాలని తలచి 2001లో  ఎపీఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిపించారు. దీనికి స్పందించిన దుబాయ్ కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్,హాంగ్కాంగ్ కి చెందిన సొమ్ ఏసియా,మలేసియాకి చెందిన ఐఓఐ  ప్రాజెక్ట్స్,స్వదేశానికి చెందిన ఎల్ అండ్ టీ ,షాపుర్జి పల్లోంజీ సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో షాపుర్జి పల్లోంజీ సొమ్ ఏసియా సంస్థల బిడ్ లను బాబు ప్రభుత్వం కావాలనే తిరస్కరించింది. తర్వాత మూడు కంపెనీల బిడ్లను పరిశీలించకుండానే .... టెండర్లు గడువు ముగిసే తేది అయిన 2002 డిసెంబర్ 26నాటికి ఎల్.అండ్.టీ, ఐఓఐ వెనుకెళ్ళిపోయాయి. ఎమ్మార్ ఒకటే మిగిలింది. ఇవన్ని సాక్షాత్ విజిలెన్స్ నివేదిక, సీబీఐ రిమాండ్ రిపోర్ట్ చెప్పిన సత్యాలే.

సహజంగా అయితే ఏ పనికైనా సింగెల్ టెండర్ వచ్చినప్పుడు ఎం చేస్తారు? దాన్ని రద్దు చేసి మళ్ళి టెండర్లు పిలుస్తారు. పోటీదారు ఉంటేనే సరైన ధర దక్కుతుందనే ఉద్దేశంతో పోటీ లేని బిడ్లను ఎవరూ అంగీకరించారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు  కావాలనే మిగతా కంపెనీల్ని వెనకేళ్ళేలా సిండికేట్ చేశారు. వాటిని ఉపసంహరింపజేశారు. మిగిలిన ఎమ్మార్ కే 535 ఎకరాల స్థలాలను కట్టబెట్టేసారు. అదీ కూడా ఎకరం 29 లక్షలకు.

మరి ఈ భూముల కేటాయింపునకు మూడేళ్ళ కిందటే ... అంటే 2000వ సంవత్సరం ఆరంభంలోనే ... ఈ భూమికి అతి సమీపంలో కొండాపూర్లో ఉన్న తన మూడెకరాల భూమిని చంద్రబాబునాయుడు ఎకరా కోటిరూపాయలకు ఎలా విక్రయిన్చుకున్నారు. మూడేళ్ళ తర్వాత అక్కడ ఎకరా రూ. 4 కోట్లపైనే పలుకుతుండగా సరిపోతుందన్నారు. తిరిగి 10వ పేరాకు వచ్చేసరికి "ఏపీఐఐసీ అనుమతి ఉండాలి.అలాగని ఏ నిర్ణయాన్నైనా హేతుబద్దం కానీ కారణాలు చూపిస్తూ ఏపీఐఐసీ అడ్డుకోజాలదు" అని చేర్చారు. ఎంఓయూ లో లేని క్లాజును కొలాబరేషన్ అగ్రీమెంట్ ద్వారా చేర్చినట్టు సీబీఐ రిమాండ్ రిపోర్టులోను, విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

-అసలు హేతుబద్దం కానీ కారణమేదో,సహేతుకమైన కారణమేదో తేలిచేదేవ్వరు? ఇలాంటి అధికారం ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపీఐఐసీ కి ఉండాలా? లేక ఎమ్మార్ చేతిలో పెడతారా ? దీన్ని ఎమ్మార్ చేతిలో పెట్టడంలో చంద్రబాబునాయుడు ఉద్దేశ్యమేంటి? ఏపీఐఐసీ దేన్నీ అడ్డుకూకూడదు అనే కదా? ఇంత నిసిగ్గుగా బరితెగించినా సీబీఐ కళ్ళు మూసుకుపోవడానికి కారణమేమిటి?కుంభకోణానికి ఈ ఒప్పందమే మూలమని నిఘా నివేదిక స్పష్టంగా చెప్పినా సీబీఐ కన్ను అటువైపు పడటం లేదెందుకు?

ఐయంజి తప్ప దేన్నీ రద్దు చేయని వై.యస్.

2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు గారి హయాంలో అనుమతించిన ప్రాజేక్ట్లును పారదర్శకంగా  సమీక్షిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అన్ని ప్రాజెక్టులను సమీక్షించారు. ఇన్వెస్ట్మెంట్లు ,ఇన్వెస్టర్ లతో ముడిపడిన ఏ ప్రాజెక్ట్ ను రద్దుచేయడానికి  ఆయన సమ్మతించలేదు. అందుకే ఎమ్మార్ సహా పలు ప్రాజెక్ట్ల పై నిర్ణయాన్ని ప్రస్తుత తమిళనాడు గవర్నరు, నాటి మంత్త్రి రోశయ్య గారి నేతృత్వంలోని కేబినేట్ సబ్ కమిటీకి 2004 జూలై లో అప్పగించారు.2004 సెప్టెంబర్ లో అది చేసిన సిఫార్సులకు సమ్మతించారు. దాని ప్రకారం విల్లాల ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటా యధాతధంగా ఉంచారు. చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 26 శాతంగానే కొనసాగించారు.

-మరి ఈ విల్ల ప్రాజెక్టును వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ రాయితీ ఇచ్చారని సీబీఐ ఆయన కుటుంబాన్ని, సన్నిహితుల్ని టార్గెట్ చేస్తోంది? ఏం వెసులుబాటు ఇచ్చారో సీబీఐ కనీసం  చూపించాలి కదా? అదేమీ లేనప్పుడు విల్లాలు అమ్మగా వచ్చిన సొమ్మును ఎమ్మార్ సంస్థ తనే కదా తీసుకుంటుంది? లేకపోతే తన ప్రాజెక్ట్ ను అప్పగించిన చంద్రబాబుకో ,ఆయన బినామీ కోనేరుకో సమర్పించుకుంటుంది కదా ?అవన్ని సీబీఐ ఎందుకు వదిలేస్తుంది? విచారించాల్సిన వారిని ఎందుకు విచారించడం లేదు? ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన పరీస్థితులు ఏమైనా ఉన్నాయా?

ఈ ఆరోపణలతో సునీల్ కేం సంబంధం?

- ఇప్పుడు సీబీఐ సునీల్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఈ ఆరోపణలమీదే.విల్ల అమ్మకాల్లో కోనేరు సూచన మేరకు స్టైలిష్ రంగారావు, ఆయన మేనేజర్ కలిసి బ్లాక్లో భారీ మొత్తాన్ని వసూలు చేశారని, ఆ మొత్తాన్ని సునీల్ రెడ్డికి అందజేశారని అది పేర్కొంటుంది.

- ఈ ఆరోపణ ఏ మాత్రమైనా నమ్మేవిధంగా ఉందా? సునీల్ రెడ్డికి మొత్తం డబ్బు ఇచ్చేయడానికి అయనేమైన ఎమ్మార్ సంస్థ యాజమాన? లేక ఎమ్మార్ కు ఈ ప్రాజెక్ట్ను అక్రమ మార్గంలో కట్టుబెట్టిన చంద్రబాబుకి ఏజెంటా? కోనేరు ప్రసాద్ బినామీనా ? కోనేరుకు బంధువా? లేఖ కోనేరు స్నేహితుడైన స్టైలిష్ రంగారావుకు బంధువా? స్టైలిష్ ఏమ్మర్ కు 29లక్షలుకే ఎందుకుఇచ్చినట్టు? పోనీ అదేమైనా ప్రజోపయోగ ప్రాజేక్టా? అంటే తన సొంత భూమి కాబట్టి ఎకరా కోటికిస్తారా? ప్రభుత్వ భూమి కాబట్టి, ప్రజల ఆస్తి కాబట్టి కారుచౌకగా కట్టబెట్టేసి అందుకు ప్రతిఫలంగా ముడుపులు కొట్టేస్తారా? నీతి నిజాయితీలు ఏ కోశాన ఉన్న బాబు ఇప్పటిదాకా దీనికేందుకు సమాధానం చెప్పలేదు? అసలు విజిలెన్స్ ఆధారంగానే కోర్టు విచారనకు ఆదేశించినా ... సీబీఐ మాత్రం దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు.? ఏం తన ఢిల్లీ భాసులు ఈ సంగతి చెప్పలేదా? ఇది కుట్ర కాదా? 26 శాతం వాటా ఎందుకుంచారు?

రైతుల నుంచి సేకరించి మరీ ఏమ్మర్ కు ఏకంగా 535 ఎకరాల భూమిని అప్పగించిన చంద్రబాబునాయుడు గారు... వాటాల విషయంలో చిత్రవిచిత్రమైన చేష్టలు చేశారు. మొత్తం 535 ఎకరాల్లో హోటల్,కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపట్టడానికి ఒక ప్రత్యేక కంపెనీని (ఎస్ పీ వీ-1)...

గోల్ఫ్ కోర్స్ ,విల్లాల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడానికి ఒక ప్రత్యేకమైన కంపెనీని (ఎస్ పీ వీ-2)ఏర్పాటు చేయగా ... మొదటి కంపెనీకి 15 ఎకరాలు,  రెండో కంపెనీకి 515ఎకరాలు కేటాయించారు.

-హోటల్,కన్వెన్షన్ సెంటర్ల లో పెట్టుబడులు ఎక్కువ, లాభాలు తక్కువ. అది కూడా దీర్గకాలం పట్టే ప్రాజేక్టులివి. వీటికిచ్చింది కేవలం 15ఎకరాలే .అలాంటి ఎస్ పీ వీ-1లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచిన చంద్రబాబునాయుడు గారు... తక్షణం లాభాలోచ్చే అవకాశం ఉన్న, 520 ఎకరాలు కేటాయించిన ఎస్ పీ వీ-2 లో మాత్రం ఏపీఐఐసీ వాటాను 26 శాతానికే పరిమితం చేశారు. ఇది ఒక్కటి చాలదా... కుట్ర ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ? రియల్ ఎస్టేట్ సహా వివిధ అవసరాల కోసం వాడుకోవడానికి అనుమతించిన విల్లా,గోల్ఫ్ కోర్స్ ల్లో ఏపీఐఐసీ వాటాను మరీ 26శాతం మాత్రమే ఎందుకుంచారు? ముడుపులు తీసుకున్నందుకా? లేక మున్ముందు తన బినామీ కోనేరుకే ఆ డబ్బులన్నీ వస్తాయనా? అప్పట్లో రియల్టీ ప్రాజెక్ట్ ల్లో బిల్డర్ ల వాటా 40 శాతం, భూ యజమాని వాటా 60శాతంగా ఎన్నో ప్రాజెక్ట్లు వచ్చాయి. మరి హైటెక్సిటీ పక్కనే ఇచ్చిన ఇంత భారీ స్థలంలో ఏపీఐఐసీ వాటాను 26 శాతానికే ఎందుకు పరిమితం చేశారు? వాటాలు ఎవరెవరికి ముట్టాయి? సీబీఐ దేన్నేందుకు వదిలేస్తుంది? దోషిని వదిలి తన టార్గెట్లను పట్టుకోవదానికా? ఇంత అరాచకాన్ని చూస్తూ ఊరుకోవాలా? జనానికి ఇవేమి తెలియడం లేదనుకుంటున్నారా?

విల్లా అమ్మకాలకు మూలం కొలాబరేషన్ ఒప్పందం!

-భూమిని ఎమ్మార్ కు కట్టబెట్టేశాక ... ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాక ... 2003 ఆగస్ట్ 19న అనూహ్యంగా మరో ఒప్పందం తెరపైకి వచ్చింది. కొలాబరేషన్ ఒప్పందం. ఎంఓయూ లో లేని కొత్త క్లాజులు ఈ కొలాబరేషన్ ఒప్పందంలో వచ్చి చేరాయి. ఈ ఒప్పందం ప్రకారం ...

-ప్రాజెక్ట్ లో ఏ భాగాన్నైన అభివృద్ధి,నిర్వహణ సహకారాల నిమిత్తం మూడో పక్షానికి అప్పగించే అధికారం ఎమ్మార్ కి ఉంటుంది.

-ఇంకా చిత్రంగా ఎం చేసారంటే ... ఎమ్మార్ ఇలా మూడో పక్షానికి అప్పగించేటపుడు ఏపీఐఐసీ బోర్డు అనుమతి తప్పనిసరి అని 5వ పేరాలో పేర్కొన్నారు. కానీ 7 వ పేరాకు వచ్చేసరికి ఏపీఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరిస్తే సంస్థకి ఏమైనా డైరెక్టరా? ఇవేవి కాకుండా ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయవలసి వచ్చింది?

- ఎమ్మార్ సంస్థ తాను అధికారికంగా చదరపు గజానికి రూ.5000వసూలు చేసినట్లు రికార్డుల్లో చూపించింది. ఏపీఐఐసీ వాటాను ఎగ్గోట్టడానికే  ఎమ్మార్ సంస్థ ఇలా చేసిందని అనేది సీబీఐ ఆరోపణ. మరి ఏపీఐఐసీకి పావలా వాటా ఎగ్గొట్టడానికి ఇలా చేసిన ఎమ్మార్ సంస్థ... తాను వసూలు చేసిన మొత్తం రూపాయి వాటాను సునీల్ రెడ్డి కి ఎందుకు అందజేస్తుంది? దానికేమైనా పిచ్చా? లేక ఈ ఆరోపణలు చేస్తున్న వారికి ఏమైనా మతితప్పినదా?

-కొలాబరేషన్ ఒప్పందం వల్లే ఏపీఐఐసీకి నష్టం వచ్చిందనేది పచ్చి నిజం. ఎందుకంటే ఈ ఒప్పందం మేరకు మూడో పక్షం తనకు నచ్చిన రేటుకు విల్లాలు అమ్ముకోవచ్చు.దీని ఆసరా చేసుకున్న కోనేరు... 5వేలకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించి, అధిక మోత్తాన్ని తెరవెనుక వసూలు చేశారు. ఉదాహరణకు 2వేల గజాల ప్లాటును గజం రూ.5వేల చొప్పున రూ.కోటికి విక్రయించామనుకుంధాం. ఏపీఐఐసీ వాటా 26శాతం అయితే దానికి 26 లక్షలోస్తాయి... ఒప్పందం లేని పక్షంలో ఆ ప్లాట్ ను మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించే వీలుండదు. మార్కెట్ ధర గజం రూ.20వేలు ఉందనుకున్న ... 2వేల గజాల ప్లాటును రూ. 4కోట్లకు విక్రయించాలి.అందులో ఏపీఐఐసీ వాటా 26శాతమే అనుకున్నా రూ.1.02కోట్లు వస్తాయి.దీన్ని బట్టే బాబు కొలాబరేషన్ అగ్రిమెంట్ ద్వారా ఎంత కుట్రకు తెరతీసారనేది తెలుస్తుంది. మరి ఈ సొమ్మంతా ఎటు పోయిందనేది చంద్రబాబుగారు చేబితేనో ధర్యాప్తు సంస్థ బయటపెదితేనో కానీ వెల్లడి కాదు.వారిద్దరూ కుమ్మకైతే ఈ నిజాలన్నీ ఇలాగె సమాధి అయిపోతాయి.అది ధర్యాప్తు సంస్థ విశ్వసనీయతకు ఏ మాత్రం మంచిది కాదు.

-మేము చెబుతున్నది ఒక్కటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను మాత్రమే తాము విచారిస్తామని, మిగిలిన ప్రభుత్వాల జోలేకేల్లభోమని సీబీఐ గనుక తీర్మానించుకుంటే .....చంద్రబాబునాయుడు గారిని తాకకూడదనుకుంటే.... వైయస్ఆర్ కాబినేట్లో మంత్రులుగా ఉన్నవారు ఇప్పుడు మంత్రులుగానే ఉన్నారు. అప్పట్లో సబ్ కమిటీ సభ్యులుగా ఉన్నవారిలో ఒకరు ఇప్పుడు వేరొక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు.మిగతా వారు మంత్రులుగానే ఉన్నారు. అటు కుట్రకు కారణమైన, కుంభకోణానికి కారణమైన  చంద్రబాబును వదిలేస్తున్నారు. ఇటు వైయస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మార్ పై సిఫార్సుల చేసిన సబ్ కమిటీనీ వదిలేస్తున్నారు. ఏపీఐఐసీ ని , ఆఖరికి ఎమ్మార్ ను కుడా వదిలి పెట్టి కేవలం వైయస్ఆర్  వారసుడునని, ఆయన బంధు మిత్రులను టార్గెట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో  ప్రతీస్టాత్మక ధర్యాప్తు సంస్థ గా ఉన్న సీబీఐకి ఇంత తాబేదారుగిరి ఏ మాత్రం సరికాదు. ఇంత గులాంగిరి పనికి రాదు. ఇప్పటికైనా ఈ ప్రశ్నలకు జవాబివ్వండి. లేకుంటే ధర్యాప్తు తీరును మార్చుకోండి. ఇవన్ని చేతకాకుంటే ఢిల్లీ రాజకీయ బాసులకు తాబెదార్లన్న ముద్ర వేసుకోండి.

Back to Top