స్పీకర్ : జూపూడి ప్రభాకరరావు -మార్చి 6,2012

ఈనాడు యాజమాన్యానికి ప్రజలు మీద గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే వేలది చేతులేస్తాయి అడ్డుకుంటాయి అని అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కుక్కలు పందులు తప్ప మనుషులు లేరని కార్టూన్ వేసారు. రామోజీరావు కు చంద్రబాబుకు మద్య ఎలాంటి విస్వాశముందో మాకైతే తెలియదు గాని మీరు మనుషులను కుక్కలతో పోల్చారు. జగన్ మోహన్ రెడ్డిగారిని అరెస్ట్ చేస్తారని పుకారు వస్తే వేలాదిమంది కార్యకర్తలు ఆ ఇంటి దగ్గర ఉన్నారు, అరెస్ట్ చేయడానికి ఎవరూ రాలేదు జగన్ అరెస్ట్ అవుతారు అని ఈనాడు వాళ్ళు చంద్రబాబునాయుడు గారు ఆశపడ్డారు గాని జరగలేదు. ఈ రోజు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రదానంగా సమాజ్వాదీ పార్టీ అత్యదిక 225సీట్లు గెలుచుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నేర్చుకోవలసి ఉంది మీరు కోటరి మాటలు నమ్మి పనిచేవాళ్ళను గౌరవించే పరీస్తుతుల్లో లేరు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులను ప్రజలు గెలిపించారు.మాయమాటలు చెప్పి గాల్లో తిరిగే నేషనల్ నాయకులను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ ఆర్.ఎల్.డి. రెండూ కలిపినా 40 స్థానాలు కూడా రాలేదు. నేషనల్ పార్టీలను ప్రజలు ఓడిస్తున్నారు 22 సంవత్సరాలుగా చెప్పులు అరిగిపోఎట్టుగా తిరిగిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో దరిదాపులకు రానీయలేదు.2009 లో కాంగ్రెస్ కు 20 పార్లిమెంట్ సీట్లు రావడం జరిగింది ఆర్.ఎల్.డికి 6సీట్లు మొత్తం 26వచ్చాయి. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 9 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా 33సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా కాదు రాహుల్ గాంధీ,సోనియాగాంధీ ద్వారా వచ్చింది అన్నారు మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఎందుకు గెలవలేదు అని నేను అడుగుతున్న ఇటీవల జరిగిన ఎన్నికలు చూస్తే అన్నీ ప్రాంతీయ పార్టీలే విజయం సాదించాయి 2014లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వస్తుంది, రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా అధికారంలోకి వచ్చి ఆయన మీద,ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి గారిమీద సీబీఐ ఎంక్వైరీ వేసి వారి కుటుంబాన్ని గందరగోళపరుస్తున్నారు పద్దతికాదు మానుకోవాలని కోరుతున్నాం. కేసుల ద్వారానే జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని చూస్తే ప్రజలు ప్రజా స్వామ్య  పద్ధతిలో బుద్ధి చెప్తారు. ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్ ని చూసి ఎవరూ ఓట్లు వేయలేదు ఆయన కుమారుడు అఖిలేష్ ని చూసి ఓట్లు వేసారు. ములాయంసింగ్ అత్యంత అవనీతిపరుడని కేసులున్నాయి చంద్రబాబులాగానే అవనీతిపరుడు . ఉత్తరప్రదేశ్ లో సుస్థిరమైన పాలన మాయావతి ఇచ్చింది 5సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపితే సుస్థిరమైన పాలన కాదా? వెన్నుపోటు పొడవాలా లేదా వైస్రాయ్ ఘటనలు ఎమ్మల్యేలనుకుని అమ్మి బేరాలాడాలా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబునాయుడు గారిని జనం నమ్మడం లేదుగనుక అందుకని ఆయన కుమారుడు లోకేష్ గారిని రంగంలోకి దింపితే ప్రజలు కోత్తదనంతో డిపాజిట్ ఐనా మిగుల్చుతారు.

తాజా వీడియోలు

Back to Top