ఏబీఎన్ కార్యాల‌యం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నిరసన 

హైదరాబాద్ :  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ప్రచురించిన కొన్ని రచనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. ఏబీఎన్ కార్యాలయం సమీపంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నినాదాలు చేశారు. ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్‌లో ప్రచురితమైన కొత్త‌ప‌లుకు క‌థ‌నం బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అన్నారు. విలువలు దిగజార్చేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని చెప్పారు. మహిళలకు ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? ఏబీఎన్‌ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్‌ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఒక చీటర్‌’ అని అన్నారు. ధర్నాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్‌, శ్రీకాంత్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మార్గాని భరత్‌, కారుమూరి, ఇజ్రాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.
 


 

Back to Top