ఈ రోజు ప్రజలను చీట్ చేయడానికి తెలుగుదేశం అసత్య ప్రచారానికి వారు పూనుకున్నారు, జగన్‌మోహన్‌రెడ్డి గారు 16 లక్షల కొట్ల రూపాయలు లూటి చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. వారు అసత్య ప్రచారంచేసి దెబ్బకొడుతున్నారని అనుకుంటున్నారు కాని వారికి వారే కించపరుచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక 1956 నుండి 2012 వరకు అన్ని మైనింగ్‌లు ప్రోడక్స్ కలిపి 2 లక్షల కోట్లు కూడ లేదు. 56 సంవత్సరాలలో జరిగిన విలువ ఒక్క ఫ్రాఫిట్ మీద చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐరన్ ఓర్ మైన్స్ ప్రకాశం కడప కరీంనగర్ .జిల్లాలో ఉన్నాయి మీరు తీసుకోండి అంటే వారు అక్కడ దొరికే ఐరన్ ఓర్ 56 శాతం ఉంది ఎక్స్‌పోర్టు చేయాలంటే మినిమ్ 63 శాతం ఉండాలి ఈ మైన్స్ మాకు వద్దుఅని అన్నారు ఎన్ ఎమ్‌డీసీ వాళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 10 రోజుల్లో ఐరన్ ఓర్ ని వారు 14 లక్షలకోట్లు గా చెబుతున్నారు మేము 14 వేల కోట్లకి ఇస్తాము,తీసుకుంటారా అని అడుగుతున్నాం చంద్రబాబుకి బెస్ట్ బిజినెస్‌మేన్‌అవార్డు గ్రహీత బిరుదు వుంది.సామాన్య ప్రజలకి అర్ధం అవుతుంది వీరు చెబుతున్నది అంతా బోగస్ అని. జగన్‌మోహన్ రెడ్డి గారి దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి అని అంటున్నారు. సీబీఐ వారు సుమారు 280 రోజులైంది విచారణ మోదలుపెట్టి సుమారు 2000 మంది పోన్లు ట్యాప్ చేసారు. జగన్‌మోహన్ రెడ్డి గారికి సంబందించి వారిదగ్గర 25 సంవత్సరాల క్రితం పనిచేసిన వారందరిని విచారించారు.28 టీంలు సీబీఐ వెళ్ళి జగన్‌మోహన్ రెడ్డి గారికి సంభందించి డిక్లేర్ చేయనటువంటి ఒక్క అకౌంట్ అయిన కనుక్కున్నారా.చిరంజీవి కూడ జగన్‌మోహన్‌రెడ్డిగారి గురించి మాట్లాడుతున్నారు, చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా 75 లక్షల మంది ఓటు వేశారు. కాని చిరంజీవి వీరందరి వదిలేసి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోచేరిపోయారు. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్న మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి. 18 ఉప ఎన్నికలు జరుగుతున్నా నియోజకవర్గాల్లో ఇంతకు ముందు కాంగ్రెస్ కు 40శాతం టీడీపీకి 30 శాతం పీఆర్‌పీకి 22 శాతం ఉంది కాని ఇప్నుడు కాంగ్రెస్ పీఆర్‌పీ కలిపి 62శాతం ఉండాలి కాని రెండు కలిసినా22 శాతంలేదు.ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల తప్పుడురాతలవల్ల వారకే చెడ్డపేరు వస్తుంది. 12 వతేదిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్ల్ దక్కవు.