కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం లో ఇక నుండి రాజశేఖరరెడ్డి గారిని కుడా ఉపేక్షించకూడదు అవనీతి పరుడు అని ప్రచారం చేయాలి అని కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అవినీతి పరుడు రాజశేకరరెడ్డి గొప్పవాడు అంటే ప్రజలువిస్మరించడంలేదు కాబట్టి రాజశేకరరెడ్డి గారిని కుడా అవినీతి పరుడు అనే ముద్రవేయాలని చూస్తున్నారు.ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏ రోజైతే సిబిఐ ఎఫ్ఐఆర్ లో రాజశేకరరెడ్డి గారి పేరు చేర్చారో ఆరోజే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది . ఆ రోజే చెప్పాం కాంగ్రెస్ సిబిఐ చేత నాటకమాడిస్తుందని, జగన్ మోహనరెడ్డి గారి మీద కక్ష్య తీర్చుకోడానికి ప్రయత్నిస్తుందని. కాని కాంగ్రెస్ పెద్దలు అన్నారు రాజశేకరరెడ్డి గారు,నీతిమంతులు కాని జగన్ మోహన్రెడ్డి గారు, అవినీతిపరుడని త్రీకరించడానికి ప్రయత్నం చేసారు. కాంగ్రెస్ పెద్దలని అడుగుతున్నా మీకు తెలుగుదేశానికి తేడా ఏముందని .రాజశేకరరెడ్డి గారు అధికారం లో ఉన్నప్పుడు గొప్పవాడని కాంగ్రెస్ వాళ్ళు పొగిడారు తెలుగుదేశం మాత్రం రాజశేకరరెడ్డి గారు అవనీతిపరుడు అని పుస్తకాలు పంచారు.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ మారి విమర్సలు చేస్తుంది. రాజశేకరరెడ్డి గారి రెక్కల కష్టం తో వచ్చిన పార్టీ లో ముఖ్యమంత్రిగాను ఉపముఖ్యమంత్రి గాను పీసీసీ చీఫ్ గాను ఉన్నారు. రాజశేకరరెడ్డి గారు తెచ్చిన ప్రభుత్వం లో పదవులు అనుభవిస్తు వారినే అవనీతిపరుడు అంటున్నారు. ఆంధ్రజ్యోతి రాధకృష్ణకి ,ఈనాడు రామోజీరావుకి చంద్రబాబునాయుడికి మీకు ఏం తేడా ఉందో ఒక్క సారి ప్రజలకు చెప్పవలసిన బాద్యత మీ మీద ఉందని తెలియచేస్తున్నా. కాంగ్రెస్ రాక్షస స్వరూపం బయటపడుతుంది రాజశేకరరెడ్డి గారిని అవినీతిపరుడిగా గ చిత్రీకరించే ప్రయత్నం లో. ఈ కాంగ్రెస్ రాక్షసి ప్రాణం వచ్చే 18 ఉప ఎన్నికల్లో ఉంది. ప్రజలు గురి చూసి ఆ రాక్షసి ప్రాణం మీద కొట్టబోతున్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం ఈ రెండు తలల రాక్షసి ని కూలగోట్టబోతున్నారు. 2014 లో ఎన్నికలు వస్తాయేమో అనుకుంటున్నారు 18 ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం కుప్పకూలిపోయే పరిస్తితి వస్తుంది.తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చే అలవాటు ఉంది మనకు ఆగష్టు లో సంక్షోభం రావచ్చు తర్వాత ప్రభుత్వం కూలిపోవచ్చు.కాంగ్రెస్ ఓ చిల్లు పడిన పడవ అది ఎప్పటికైనా మునక్క తప్పదు. అటువంటి పడవలోకి చిరంజీవి 15 మందితో వచ్చి చేరాడు. సర్వేసత్యనారాయణ,వీర శివారెడ్డి,గండ్ర మీ స్థాయి మరచి మాట్లాడుతున్నారు.మీరు రాజశేకరరెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులు కాదు,సభ్యులు కాదు మీరందరకి ప్రజలు సమాధానం చెప్తారని తెలియచేస్తున్నా. మీ కాంగ్రెస్ అదిష్టానం చేత చెప్పించండి రాజశేకరరెడ్డి గారికి కాంగ్రెస్ కు సంబంధం లేదని చెప్పించండి.ఈ 26 జీఓ లు ఇష్యూ చేసినప్పుడు అధికారులుకు గాని మంత్రులకు గాని ఎవరకి సంబంధంలేదని రాజశేకరరెడ్డి గారికే మాత్రమే బాధ్యుడని ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం. చంద్రబాబునాయుడు గారు డిల్లీ వెళ్లి రహస్యంగా అధిష్టాన వర్గంలో ప్యాకేజీలు మాట్లాడుకుని ఇలాంటి ఇలాంటి ఎజెండాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబునాయుడు గారు మీరుకూడా పి.ఆర్.పి. లాగా కాంగ్రెస్ లో పార్టీని విలీనంచేసుకోండి పదవులైనా దక్కుతాయి.