గుంటూరు జిల్లా: కమిటీ సభ్యుల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని వైయస్ఆర్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయర్త బలసాని కిరణ్ కుమార్ సూచించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్డులోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ, వార్డు/డివిజన్ స్థాయి కోర్ కమిటీలు మరియు అనుబంధ విభాగాల నిర్మాణం, డిజిటైజేషన్ పూర్తి అయిన సభ్యుల వెరిఫికేషన్ ప్రక్రియపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కొంతమంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉండటం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తి చేయని సభ్యులను గుర్తించి, వారిని ప్రత్యక్షంగా కలసి అధికారిక లింక్ ఓపెన్ చేయించి, రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ద్వారా OTP నమోదు చేయించి, పేరు, ఫోటో, ఇతర వివరాలను సరిచూసి ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. పార్టీ నిర్మాణం బలోపేతానికి డిజిటైజేషన్ కీలకమని, ప్రతి సభ్యుడు బాధ్యతగా వ్యవహరించి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ, సోషల్ మీడియా, యువజన విభాగ అధ్యక్షులు, మండల స్థాయి ప్రతినిధులు, డిజిటల్ మేనేజర్లు, అలాగే గ్రామ/వార్డు/డివిజన్ స్థాయి సోషల్ మీడియా మరియు యువజన విభాగ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.