సరోజిని పుల్లారెడ్డి మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 3 ఫిబ్రవరి 2013: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సరోజిని పుల్లారెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలను ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ కొనియాడారు. హైదరాబాద్‌ నగరానికి తొలి మేయర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన సరోజిని పుల్లారెడ్డి ఆదివారం ఉదయం తెల్లవారు జామున బోయినపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా సరోజినీ పుల్లారెడ్డి పనిచేశారు.‌ ఇందిరాగాంధీకి సరోజినీ పుల్లారెడ్డి సన్నిహితురాలిగా మెలిగారు. సరోజినీ పుల్లారెడ్డి 1979లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.
Back to Top