అసైన్డ్‌ భూముల కేసు నుంచి చంద్రబాబు అండ్‌ కో తప్పించుకోలేరు 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు:  అసైన్డ్‌ భూముల కేసు నుంచి చంద్రబాబు అండ్‌ కో తప్పించుకోలేరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, నారాయణలకు కోర్టు స్టే ఇచ్చినా కౌంటర్‌ దాఖలు చేయడానికి సీఐడీకి నాలుగు వారాలు గడువు ఇచ్చిందన్నారు. ఆధారాలు సేకరించడానికి సీఐడీకి ఆ గడువు చాలు అన్నారు. విచారణకు రాకుండా క్వాష్‌కు వెళ్లారంటే ఖచ్చితంగా చంద్రబాబు అండ్‌ కో తప్పు చేశారనే అర్థం వస్తుందన్నారు. కోర్టు కేవలం చంద్రబాబు, నారాయణలకు మాత్రమే ఊరటనిచ్చిందన్నారు.కుంభకోణంలో ఉన్న మిగతా వారికి అది వర్తించదన్నారు.  అన్ని ఆధారాలతో సీఐడీ కౌంటర్‌ దాఖలు చేస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించారు. 
 

Back to Top