వైయ‌స్ఆర్ బాట‌లో వైయ‌స్ జ‌గ‌న్‌

మాజీ ఎంపీ తోట‌న‌ర‌సింహం

కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ తోట నరసింహం కొనియాడారు. బుధవారం ఆయన  టీవీతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పనితీరును ప్రశంసించారు. పరిణితి చెందిన రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ ఆయన కంటే అనేక మంచి కార్యక్రమాలను చేసి చూపిస్తున్నారని పొగిడారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఒక ఆదర్శ ముఖ్యమంత్రిలా కనిపించారని పేర్కొన్నారు. గతంలో తాను నలుగురు సీఎంల వద్ద పని చేశానని, వైఎస్ జగన్ లాంటి జనామోద నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రిని చూడలేదని ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోనే నవ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు పొందారని తోట నరసింహం అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top